టీడీపీ నేతలపై ఒకరేంజ్‌లో ఫైరయ్యారు మంత్రి గుడివాడ అమర్నాథ్. అయ్యన్న పాత్రుడు మహిళా మంత్రి పై చెప్పిన మాటలు వింటే మహిళలు ఎవరూ టీడీపీకి ఓటు వేయరన్నారు. 151 కోట్ల స్కాం చేసిన అచ్చెన్నాయుడును బొక్కలో వేయకుండా ఏం చేస్తారు? రాష్ట్రంలో ఎవరికీ ఇంగ్లీష్ వద్దంటాడు చంద్రబాబు…తన కొడుకును మాత్రం ఇంగ్లీషులో చదివిస్తాడన్నారు మంత్రి అమర్నాథ్.
చంద్రబాబుకు సిగ్గుందా? చంద్రబాబు హయాంలో 38 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే జగన్ ప్రభుత్వం 62 లక్షల మందికి ఇస్తోంది. కట్టె కాలిపోయిన తర్వాత చేసేది ఏముంటుంది?తాను అధికారంలో ఉన్నప్పుడు చేయలేకపోయాడు. తన కంటే చిన్న వయసులో ఉన్న వ్యక్తి ఇంత అద్భుతంగా చేస్తుంటే చంద్రబాబు చూడలేక పోతున్నాడని మండిపడ్డారు.
నలుగురు సహాయంగా వస్తే తప్పించి పోటీ చేయలేని పరిస్థితిలో ఉన్న చంద్రబాబు మాట్లాడుతున్నాడు. జగన్ ను తిట్టేస్తే ఇవాళ ప్రశాంతంగా నిద్రపోవచ్చు అన్న ఆలోచన చంద్రబాబుది. విశాఖను రాజధానిగా చంద్రబాబు అంగీకరిస్తున్నాడో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు అమర్నాథ్. 14 ఏళ్ళ పాటు ముఖ్యమంత్రి గా ఉన్న చంద్రబాబు విశాఖకు ఏం చేశాడు. చంద్రబాబు ఏ వీధిలోకి వెళ్ళాడో, ఏ గుడిసెలో దూరాడో నాకు తెలియదన్నారు.
ప్రజలు 2019లొనే చంద్రబాబు పై తిరగబడ్డారు. అందుకే 23 సీట్లకే పరిమితం అయ్యారు. ఈ విషయాన్ని చంద్రబాబు మర్చిపోయినట్లు ఉన్నాడు. కుప్పంలో ప్రజలు ఎందుకు తిరగబడ్డారు చంద్రబాబు చెప్పాలి. రాజకీయాల్లో ఎవరు బచ్చానో ప్రజలు నిర్ణయిస్తారన్నారు. జనసేనను రాజకీయ పార్టీగానే ఎవరూ పరిగణించటం లేదు. పవన్ కళ్యాణ్ కు ఏదైనా మూడు ఉండాలి. మూడు పార్టీలు, మూడు ఆప్షన్లు అన్నారు మంత్రి అమర్నాథ్.
Sailajanath: ప్రశ్నించే గొంతుల్ని నొక్కేస్తారా?