Site icon NTV Telugu

AP EAMCET: ఎంసెట్‌ షెడ్యూల్‌ విడుదల.. ఏ పరీక్ష ఎప్పుడంటే..

ఎంసెట్‌ షెడ్యూల్‌ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. అసెంబ్లీ మీడియాలో పాయింట్‌లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ… ఈఏపీసెట్‌ షెడ్యూల్‌ను విడుదల చేశారు.. ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్షల తేదీలను ప్రకటించారు.. జులై 4 నుంచి 8వ తేదీ వరకు ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌, జూలై 11, 12 తేదీల్లో అగ్రికల్చర్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించిన ఆయన.. రాష్ట్ర వ్యాప్తంగా 134 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు.. ఇక, ఈ పరీక్షల కోసం తెలంగాణలోనూ 4 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఏప్రిల్‌ 11వ తేదీన పూర్తి వివరాలతో EAPCET నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

Read Also: Telangana: బోయిగూడ అగ్నిప్రమాదంపై సర్కార్‌ సీరియస్.. కీలక ఆదేశాలు

జులై 4 నుంచి 8వ తేదీ వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎంసెట్ 2022 నిర్వహిస్తున్నాం.. ఐదు రోజుల్లో 10 సెషన్స్ లో పరీక్షలు ఉంటాయని.. అగ్రికల్చర్ జూలై 11, 12 తేదీల్లో ఎంసెట్ పరీక్ష.. రెండు రోజుల్లో నాలుగు సెషన్స్ లో జరుగుతుందని.. ప్రస్తుతానికి 134 సెంటర్లలో పరీక్షలు అనుకున్నాం.. అవసరమైతే సెంటర్ల సంఖ్య పెంచుతామన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్‌.. ఇతర పోటీ పరీక్షల తేదీలకు ఇబ్బంది లేకుండా షెడ్యూల్‌ ఉంటుందన్నారు. ఏప్రిల్‌ 27 నుంచి మే 9 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామన్న ఆయన.. EAPCET ఫలితాలను ఆగస్టు 15 తర్వాత విడుదల చేస్తామని తెలిపారు.. ఆగస్టు 15లోగా ఇంటర్‌ ఫలితాలను కూడా వెల్లడిస్తామని పేర్కొన్నారు.

Exit mobile version