Site icon NTV Telugu

ఇంటర్, పదో తరగతి పరీక్షలను ఇప్పట్లో పెట్టే పరిస్థితి లేదు…

Adimulapu Suresh

ఇంటర్, పదో తరగతి పరీక్షలను ఇప్పట్లో పెట్టే పరిస్థితి లేదని.. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో రకరకాల ప్రతిపాదనలు పరిశీలించామని.. స్పష్టత వచ్చాక షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు.పరీక్షల నిర్వహణ విషయమై కొన్ని పార్టీలు రాజకీయం చేయాలని అనుకుంటున్నాయని..కోవిడ్ పరిస్థితి ఉందనే పరీక్షలను వాయిదా వేశామని వెల్లడించారు. పరీక్షల నిర్వహణ విషయంలో అనేక మార్గాలుంటే.. పరీక్షల రద్దు అనే మాట ఎందుకు..? అని ప్రశ్నించారు. లోకేష్ పరీక్షల్లో నిలబడకుండా దొడ్డి దారిన పదవులు పొందారో.. అలా చేయాలనుకుంటే ఎలా..? అని ఎద్దేవా చేశారు. మంగళగిరి పరీక్షల్లో లోకేష్ ఎలా బొక్క బోర్లా పడ్డారో అందరం చూశామని.. చురకలు అంటించారు. కళాశాలల్లో కానీ.. పాఠశాలల్లో కానీ అడ్మిషన్లు చేసుకోవడానికి వీల్లేదని..ప్రభుత్వ ఆదేశాలకు భిన్నంగా అడ్మిషన్లు ప్రారంభిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Exit mobile version