Site icon NTV Telugu

Meruga Nagarjuna: టీడీపీ కుట్రలు. కుతంత్రాలకు అమాయకులు బలి

Meruaa

Meruaa

సంచలనం కలిగించిన రమ్య హత్య కేసులో న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పు ఉన్మాద వ్యక్తులకు చెంపపెట్టులాంటిదన్నారు మంత్రి మేరుగ నాగార్జున. చదువుకునే ఆడపిల్ల ను క్రూరం గా హత్య చేయడంతో రాష్ట్ర ప్రజలు నిర్ఘాంతపోయారు. ఈ హత్య జరిగిన వెంటనే మా ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించింది. రమ్య కుటుంబాన్ని సీఎం జగన్ ఉదారంగా ఆదుకున్నారన్నారు మంత్రి నాగార్జున.

హంతకుడిని పట్టుకుని చట్ట ప్రకారం శిక్షించడానికి ప్రభుత్వం , అధికారులు బాధితులకు అండగా నిలబడ్డారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేదుకు తెలుగుదేశం నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. శవాల మీద రాజకీయాలు చేయడానికి అమాయకులను పొట్టన పెట్టుకున్నారు. టీడీపీ కుట్రలు కుతంత్రాల వల్ల అమాయకులు బలవుతున్నారని మండిపడ్డారు. టీడీపీ ఎన్ని కుతంత్రాలు చేసినా జగన్ ప్రభుత్వం భయపడదన్నారు మంత్రి మేరుగ నాగార్జున.

Psycho Teacher: సైకో టీచర్ వేధింపులు.. తాళికడతానని బెదిరింపులు

Exit mobile version