మేఘా ఇంజినీరింగ్ సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రిగ్గు విజయవంతంగా తన డ్రిల్లింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. అతి త్వరలోనే మరో రిగ్గు ఒ ఎన్ జీ సీ కి సరఫరా చేయడానికి సిద్ధంగా ఉంది. రానున్నరోజుల్లో మేఘా రిగ్గులు తయారు చేయడం వల్ల దేశీయంగా, అంతర్జాతీయ స్థాయిలో రెండు బిలియన్ డాలర్ల విలువ గల మార్కెట్ ను సొంతం చేసుకోనుంది. ఒ ఎన్ జీ సీ కి సరఫరా చేయాల్సిన 47 రిగ్గులలో భాగంగా ప్రస్తుతానికి 14 రిగ్గులను వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. మొత్తానికి ఈ ఏడాది చివరి కల్ల 23 రిగ్గులను ఒ ఎన్ జీ సీ కి అందివ్వనున్నది.
మేఘా ఇంజినీరింగ్ రిగ్గులను అత్యాధునిక సాంకేతికతతో తయారు చేశారు. ఇవి అత్యంత వేగంతో భూ పొరలను సులభంగా తవ్వుతుంది. ఇవి పూర్తిగా ఆటోమేటేడ్ టెక్నాలజీ కల రిగ్గులు. ఇందులో మాన్యువల్ గా చేసే పనులు చాలా తక్కువగా ఉంటాయి. దీని వల్ల సమయం ఆదా చేయడమే కాకుండా ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు. ఇవి పూర్తిగా అత్యాధునిక హైడ్రాలిక్ వ్యవస్థతో పనిచేసే రిగ్గులు. వీటిని సులభంగా, త్వరగా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తరలించవచ్చు. ఈ అత్యాధునిక రిగ్గుల వలన డ్రిల్లింగ్, ఇతర అనుబంధ పనులు కనీస భూపరిమాణంలో కార్యకలాపాలు కొనసాగించేందుకు వీలుగా ఉంటాయి. వీటి వలన భూమి వంటి అరుదైన వనరులను కాపాడవచ్చు.
డ్రిల్ మెక్ చైర్మన్ బొమ్మారెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ… డ్రిల్ మెక్ అనేది మేఘా సంస్థలో అయిల్ రిగ్గులను ప్రపంచవ్యాప్తంగా తయారు చేసే కంపనీ. ఇది అత్యాధునిక రిగ్గులను తయారు చేసి భారత హైడ్రోకార్బన్ రంగానికి అందిస్తుంది. చమురు, ఇందనం వెలికితీసే రిగ్గులను తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసి వినియోగంలోకి తెచ్చిన ఘనత మేఘా ఇంజనీరింగ్ సొంతం చేసుకుంది. గుజరాత్ రాష్టంలోని కల్లోల్ ఆయిల్ క్షేత్రంలో ఓ ఎన్ జీ సీ లో కోసం 3 అధునాతన రిగ్గులను ఏం ఈ ఐ ఎల్ తయారు చేస్తోంది. ఇందులో ఒకటి (సి1 ఆర్ 1) ఇప్పటికే విజయవంతంగా ఇంధనాన్ని వెలికి తీసే స్థాయికి డ్రిల్లింగ్ చేసింది. రెండోదైన సి1 ఆర్ 2 ను డ్రిల్లింగ్ చేసే విధంగా సిద్ధంగా చేసే ఓ ఎన్ జీ సీ కి అప్పగించనుంది. మూడో రిగ్గు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చైర్మన్ బొమ్మారెడ్డి శ్రీనివాస్, ఆయిల్ రిగ్స్ హెడ్ ఎన్. కృష్ణ కుమార్, వైస్ ప్రెసిడెంట్ పి. రాజేష్ రెడ్డి, డ్రిల్ మెక్ ఇంజినీరింగ్ నిపుణులు ఉంబెర్టో లావేజీ, అలెగ్జాండ్రో పెడర్ జోలీ డ్రిల్లింగ్ రిగ్గుల గురించి వివరించారు.
1500 హెచ్.పి. మోబైల్ హైడ్రాలిక్ డ్రిల్లింగ్ రిగ్గును తయారు చేసి, ఓ ఎన్ జి సి కి సరఫరా చేయడానికి సిద్ధంగా ఉంది. గుజరాత్ రాష్ట్రం లోని ఓ ఎన్ జి సి – అహ్మదాబాద్ అసెట్ పరిధిలోని జి జి ఎస్ IV కల్లోల్ క్షేత్రానికి దగ్గరగా ఉన్న దామాసాన గ్రామంలో గల కెఎల్.డి.డి.హెచ్ చమురు బావి వద్ద కార్యకలాపాలను చేపడుతుంది. భారత ప్రధాన మంత్రి కలల ప్రాజెక్ట అయిన మేకిన్ ఇన్ ఇండియాలో భాగంగా ఈ రిగ్గులను తయారు చేయడం మాకు ఎంతో గర్వంగా ఉంది. మేఘా సంస్థ ఆయిల్ రిగ్స్ డివిజన్ అధిపతి శ్రీ కృష్ణకుమార్ మాట్లాడుతూ.. మేఘా స్వదేశీ రిగ్గుల తయారీ, నిర్వహణ హైడ్రో కార్బన్స రంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పులకు కారణమైంది. గత ఆరు సంవత్సరాలుగా కష్టపడుతూ, ఈ స్వదేశీ రిగ్గులను భారత ప్రభుత్వ ప్రతిష్ఠత్మకమైన మేకిన్ ఇన్ ఇండియా లో భాగంగా తయారు చేసి ఓ ఏన్ జీ సీ కి అనతి కాలంలోనే అప్పగించడం ఎంతో గర్వకారణం.
కాలం చెల్లిన పరిజ్ఞానం, సాంప్రదాయంగా వినియోగించే రిగ్గుల స్థానంలో అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలతో కూడిన రిగ్గులను అంతర్జాతీయ స్థాయీలో తయారు చేసి భారత దేశానికే కాకుండా ప్రపంచానికే పరిచయం చేసిన ఘనత మేఘాకే దక్కిందని పేర్కోన్నారు. ఎం ఈ ఐ ఎల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ రాజేష్ రెడ్డి మాట్లాడుతూ.. అధునాతన సాంకేతిక పరిజ్డానాన్ని మన దేశానికే కాకుండా ప్రపంచం మొత్తానికి అందించే స్థాయికి ఎదిగామని, అందులో భాగంగా ఇప్పుడు వివిధ దేశాలలో రిగ్గుల సరఫరా, తవ్వకం, నిర్వహణ చేస్తున్నామన్నారు. భారతదేశంలో హైదరాబాద్, కాకినాడలలో ఉత్పత్తి కేంద్రాలలో రిగ్గలను తయారు చేస్తున్నామని అన్నారు. అలాగే ఇటలీలోని మిలాన్ సమీపంలోనూ, అమెరికా లోని హోస్టన్, బెలారస్ (యూరప్) లలోనూ ఉత్పత్తి కర్మగారాలలో ప్రపపంచ వ్యప్త అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఈ కంపెనీ దాదాపు 70కి పైగా రిగ్గులను తయారు చేస్తోందని వివరించారు.
భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘ మేకిన్ ఇండియా & ఆత్మ నిర్భర్ భారత్ ‘ కార్యక్రమం లో భాగంగా మేఘా ఇంజనీరింగ్ స్వదేశీ పరిజ్ఞానంతో డ్రిల్లింగ్ రిగ్గులను తయారు చేసి మహారత్న హోదా గల ప్రభుత్వ రంగ సంస్థ ఓ ఎన్ జి సి (చమురు & సహజవాయువు కార్పోరేషన్) కి స్వల్ప కాలంలోనే సరఫరా చేసింది. ఈ డ్రిల్లింగ్ రిగ్గులు చమురు నిక్షేపాలను వెలికితీసేందుకు ఉపయోగపడతాయి. సాధారణంగా వీటి నిర్మాణము విదేశాలలోనే ఎక్కువగా జరుగుతుంది. వనరుల లేమి ఉన్నప్పటికీ భారత దేశంలోనే తొలిసారిగా ప్రైవేట్ రంగంలో స్వదేశీ పరిజ్ఞానంతో డ్రిల్లింగ్ రిగ్గులను నిర్మించిన ఘనత “మేఘా” కే దక్కింది. ఇటీవలే మేఘా ఇంజనీరింగ్ సంస్ధ భారత దేశంలోనే తొలిసారిగా దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన రిగ్గును హైడ్రో కార్బన్స్ దిగ్గజ సంస్ధ ఓ ఎన్ జి సి కి సరఫరా చేసి ఒక చమురు బావి డ్రిల్లింగ్ కార్యకలాపాలను దిగ్విజయంగా పూర్తి చేసింది. 1500 హెచ్.పి. సామర్థ్యం గల రిగ్గు అత్యాధునిక హైడ్రాలిక్ వ్యవస్థతో పనిచేయడమే కాకుండ 4000 మీటర్ల లోతు వరకు భూ పొరలను సులభంగా మరియు వేగంగా తవ్వుతుంది. ఈ రిగ్గు చమురు బావులను వేగంగా తవ్వడంతో పాటు తక్కువ విద్యుత్తుతో పనిచేస్తుంది. ఈ రిగ్గుని వినియోగించే సమయం లో కూడా ప్రమాదాలు సంభవించకుండా అత్యాధునిక భద్రతా ప్రమాణాలు మరియు రక్షణ వ్యవస్థ లు కలవు. ఈ రిగ్గును పూర్తిగా ఆటోమేటెడ్ టెక్నోలజి తో తయారు చేయడం వలన మేఘా ఇంజనీరింగ్ సంస్థ సాంకేతిక రంగంలో మరో మైలురాయిని అందుకుంది.
ఇవి 40 సంవత్సరాల పాటు నిరాటంకంగా పని చేసే విధంగా తయారు చేశారు. అంతే కాకుండ వీటిని ఎక్కడికైనా సులభంగా తరలించవచ్చు మరియు బిగించవచ్చు. అందుకే వీటిని మోబైల్ హైడ్రాలిక్ రిగ్స్ అంటారు. ఒక్కో రిగ్గును తయారు చేయాలంటే చాలా వ్యయ ప్రయాసలకు ఓర్చుకొని చేయాల్సి ఉంటుంది. రిగ్గు తయారీ మరియు దాని కార్యకలాపాలు మొదలు పెట్టాలంటే దాదాపుగా 12 రకాల విభిన్న పనుల సమాహారం గా చెప్పవచ్చును. ఈ ప్రక్రియ లో మాస్ట్ , సబ్ స్ట్రక్చర్ తయారీ, హోయిస్టింగ్ & రోటరీ వ్యవస్థ, పైప్ యాంత్రీకరణ, బురద నియంత్రణ వ్యవస్థ, విద్యుత్ వ్యవస్థ, రిగ్ యుటిలిటీస్, ఇంధన వ్యవస్థ, ఆఫీస్ మరియు గిడ్డంగి, ఎలక్ట్రికల్ వ్యవస్థ, రిగ్ ఇన్స్ట్రుమెంటేషన్ మరియు నియంత్రణ పరికరాలు ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. వీటన్నటినీ చేయాలంటే నిబద్దత, క్రమశిక్షణ మరియు అత్యాధునిక సాంకేతిక నిపుణులు అవసరం. వీటన్నిటినీ అనుసరిస్తూ రిగ్గులను నిర్మంచడంలో మేఘాదే అందె వేసిన చెయ్యి.
ఓ ఎన్ జి సి నుండి 47 డ్రిల్లింగ్ రిగ్గుల తయారి , సరఫరా ఆర్డర్ ను పొందిన మేఘా ఇప్పటికే మొదటి రిగ్గును సరఫరా చేసి రెండవ రిగ్గు ను ఓ ఎన్ జి సి కి అందివ్వనున్నది. అతి త్వరలోనే మిగతా 45 రిగ్గులని సరఫరా చేయనున్నారు. మొత్తం 47 రిగ్గులలో 27 ల్యాండ్ డ్రిల్లింగ్ రిగ్గులు, 20 వర్కోవర్ రిగ్గులు కలవు. 27 ల్యాండ్ డ్రిల్లింగ్ రిగ్గులలో రెండు 1500 హెచ్.పి. మోబైల్ హైడ్రాలిక్ డ్రిల్లింగ్ రిగ్గులు, పదిహేడు 1500 హెచ్ పి ఏసి వీఎఫ్ డి రిగ్గులు , మిగతా ఆరు 2000 హెచ్.పి. ఏసి వీఎఫ్ డి రిగ్గులు ఉన్నాయి. మరో రెండు 2000 హెచ్.పి – హెచ్ టి వీఎఫ్ డి రిగ్గుల తయారీ వివిధ దశల్లో ఉంది. 2000 హెచ్ పి సామర్థ్యం గల డ్రిల్లింగ్ రిగ్గు భూ ఉపరితలం నుంచి 6000 మీటర్ల లోతు వరకు చమురు బావులను సులువుగా తవ్వగలదు. 20 వర్కోవర్ రిగ్గులలో పన్నెండు 50 ఎంటి ఆటోమేటెడ్ రిగ్గులు, నాలుగు 100 ఎంటి ఆటోమేటెడ్ రిగ్గులు, నాలుగు 150 ఎంటి ఆటోమేటెడ్ రిగ్గులను రూపొందిస్తున్నారు.
మేఘా సంస్థ ఈ 47 రిగ్గులలన్నింటిని దేశంలో ఉన్నా ఓ ఎన్ జి సి క్షేత్రాలైన గుజరాత్ ( అహ్మదాబాద్, అంకెలేశ్వర్, మేహసన, క్యాంబే ), అసోం (శిబ్ సాగర్, జోర్హాట్), త్రిపుర (అగర్తల), ఆంధ్ర ప్రదేశ్ (రాజమండ్రి) , తమిళనాడు (కారైకల్) కు సరఫరా చేస్తుంది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రిగ్గులతో ఉత్పత్తి అయ్యే పెట్రోలియం ఇక్కడి ప్రజల అవసరాలను తీర్చూతూ.. దిగుమతుల భారాన్ని తగ్గిస్తూ.. తద్వారా భారత ఆర్ధిక వ్యవస్థ కు తోడ్పాటు అందించేందుకు కృషి చేస్తుంది. ఓ ఎన్ జి సి – అహ్మదాబాద్ అసెట్ పరిధి లో ఈ రిగ్గు కార్యకలాపాల వలన దేశీయంగా చమురు ఉత్పత్తులు అధికంగా అందుబాటలోకి రాగలవు. మారుమూల ప్రాంతాల్లోకి కూడా చమురు సంబంధ ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయి. మేకీన్ ఇండియా నినాదాన్నే మేఘా విధానంగా ముందుకెళ్తు భారత ఇంధన రంగ యవనికపై తనదైన ముద్ర వేస్తుంది మేఘా ఇంజనీరింగ్. ఇంధన శక్తి రంగంలో భారత్ ను ప్రపంచంలో అగ్ర భాగాన ఉంచే దిశలో మేఘా సంస్థ నిరంతరం పాటుపడుతుoది.
మేఘా ఇంజనీరింగ్ సంస్ధ భారత నిర్మాణ రంగంలోనే కాక చమురు, ఇంధన రంగం లో, రవాణా , విద్యుత్ రంగాలలో కూడా అద్వితీయంగా ప్రాజెక్ట్స్ ని చేపట్టి భారత దేశ అభవృద్ధి పథంలో భాగస్వామి గా నిలుస్తుంది. మేఘా సంస్థ హైడ్రోకార్బన్ రంగం లో దేశ విదేశాల్లో అనేక ప్రాజెక్ట్ లు చేపట్టి విజయవంతంగా పూర్తి చేసి మన్ననలు అందుకుంది. భారత దేశం లో అసోం, ఆంధ్ర ప్రదేశ్, గుజరాత్, త్రిపుర , తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో సంక్లిష్టమైన ప్రాజెక్ట్ లు చేపట్టడంతో పాటు కువైట్, జోర్డాన్, బంగ్లాదేశ్, సింగపూర్ వంటి విదేశాల్లో అత్యాధునిక సాంకేతికత తో రిఫైనరీ ప్రాజెక్ట్ లను సకాలం లో పూర్తి చేసి తన సత్తాను డౌన్ స్ట్రీమ్ రంగంలోనూ నిరూపించుకుంది.
