Site icon NTV Telugu

Extramarital Affair: మరో వ్యక్తితో భార్య జంప్.. తప్పేట్లు మోగిస్తూ గ్రామంలో భర్త ఊరేగింపు

Married Woman Affair

Married Woman Affair

Married Woman Eloped With Lover In Anantapur Husband Protest Unique Way: మరో వ్యక్తితో తన భార్య పారిపోవడంతో.. ఓ భర్త గ్రామంలో వినూత్న నిరసన చేపట్టాడు. తన భార్యను తీసుకెళ్లిన వ్యక్తి ఫోటోను సైకిల్‌కి తగిలించి.. చెప్పుల హారం వేసి.. తప్పేట్లు మోగిస్తూ గ్రామంలో ఊరేగించాడు. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. మడకశిర మండలం క్యాంపురంలో అంజి అనే వ్యక్తి నివాసముంటున్నాడు. మొదట్లో వీరి సంసార జీవితం సజావుగానే సాగింది. కానీ.. అంజి భార్యకు కొంతకాలం క్రితం దివాకర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది వివాహేతర సంబంధంగా మారింది. తొలుత వీళ్లు ఎవ్వరికీ తెలియకుండా.. తమ రాసలీలల్ని గుట్టుగా సాగించారు.

Pawan Kalyan: నాకు ప్రాణహాని ఉంది.. ప్రత్యేక సుపారీ ఇచ్చారు

అయితే.. భార్య ప్రవర్తనలో మార్పు రావడాన్ని గమనించి అంజి, ఆమెపై ఓ కన్ను వేసి ఉంచాడు. ఎట్టకేలకు అతని అనుమానం నిజం అయ్యింది. దివాకర్‌తో తన భార్య సన్నిహితంగా ఉన్నప్పుడు.. అంజి అడ్డంగా పట్టుకున్నాడు. అప్పుడు ఇద్దరినీ మందలించాడు. తన భార్య జోలికి రావొద్దంటూ దివాకర్‌కు అంజి గట్టి వార్నింగే ఇచ్చాడు. అటు.. తన భార్యను కూడా అతనికి దూరంగా ఉండాలని సూచించాడు. అయినా.. ఆ ఇద్దరి తీరు మారలేదు. తరచుగా కలుసుకోవడం మొదలుపెట్టారు. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి. దీంతో.. అంజి భార్య తన ప్రియుడు దివాకర్‌తో లేచిపోవాలని నిర్ణయించుకుంది. అంజి ఇంట్లో లేనప్పుడు.. తన సామాన్లు తీసుకొని దివాకర్‌తో ఆమె వెళ్లిపోయింది.

Odisha: ఆడుకుంటూ కారులోకి ఎక్కి ఊపిరాడక చనిపోయిన ఐదేళ్ల చిన్నారి

తన భార్య కనిపించకుండా పోవడం, దివాకర్ ఆచూకీ కూడా లేకపోవడంతో.. వాళ్లిద్దరు లేచిపోయారని అంజి నిర్ధారించుకున్నాడు. దీంతో.. కోపాద్రిక్తుడైన అంజి, వినూత్నంగా నిరసన చేపట్టాడు. దివాకర్ ఫోటోను తన సైకిల్‌కి తగిలించుకొని.. ఆ ఫోటోకు చెప్పుల హారం వేసి.. తప్పేట్లు కొడుతూ గ్రామంలో ఊరేగించాడు. తన భార్యని దివాకర్ లేపుకెళ్లిపోయాడంటూ.. ప్రచారం చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

Exit mobile version