విశాఖలో ఓ లాడ్జిలో ప్రేమ జంట ఆత్మహత్యా యత్నం కలకలం రేగింది. ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది ప్రేమ జంట. కేజీహెచ్ ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. అమ్మాయి విశాఖ వాసి కాగా, అబ్బాయిది వరంగల్. పంజాబ్‌లో కలిసి చదువుకుంది ఈ జంట. ఈ ఆత్మహత్యకు గల కారణాలు బయటపడ్డాయి. ప్రేమించాలని అడగ్గా యువతి నిరాకరించింది. దీంతో అతను ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
అంతకుముందు నీతో మాట్లాడాలని అమ్మాయిని లాడ్జి కి తీసుకెళ్ళాడు ఆ యువకుడు. ప్రేమకు నిరాకరించడంతో తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ ను పోసి తగలబెట్టాడా యువకుడు. తర్వాత ఒంటిపై తను కూడా కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు ఆ ఉన్మాది. వీరిద్దరికీ చాలాకాలంగా పరిచయం వుంది. పంజాబ్ లో బీటెక్ చదువుకున్నారు ఇద్దరూ. గాయపడ్డ ఇద్దరినీ కేజిహెచ్ కు తరలించారు. పూర్తిగా కాలిన గాయాలతో యువతి యువకుడు వున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
