Site icon NTV Telugu

Nara Lokesh: పల్నాడులో లోకేష్ టూర్ టెన్షన్

Lokesh 1

Lokesh 1

ఇవాళ పల్నాడు జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించనున్నారు. హత్యకు గురైన టీడీపీ కార్యకర్త జల్లయ్య కుటుంబాన్ని బొల్లాపల్లి మండలం రావులాపురంలో పరామర్శించనున్నారు లోకేష్. ఆయన పర్యటన సందర్బంగా పల్నాడు జిల్లాలోని కొండమోడు నుండి రావులాపురం వరకు బైక్ లు, కార్లతో భారీ ర్యాలీ నిర్వహించనున్నాయి టీడీపీ శ్రేణులు. లోకేష్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఈసందర్భంగా ఎలాంటి ర్యాలీలు చేపట్టకూడదని పల్నాడు టీడీపీ నేతలకు నోటీసులు జారీచేశారు పోలీసులు.

లోకేష్‌కు భారీ స్థాయిలో స్వాగత సన్నాహాలు చేస్తున్నారు పల్నాడు టీడీపీ నేతలు. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీగా బైక్ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ర్యాలీ చేపట్టి తీరతామంటున్నారు పల్నాడు నేతలు. ర్యాలీలు చేపడితే లోకేషును అడ్డుకునేందుకు సిద్దమవుతున్నారు పోలీసులు. ర్యాలీలకు ఎలాంటి అనుమతి లేదని నోటీసుల్లో స్పష్టీకరించారు. ప్రాణనష్టం, అల్లర్లు జరుగుతాయంటూ నోటీసులివ్వడంపై టీడీపీ నేతలు ఆగ్రహానికి గురవుతున్నారు. గతంలోనూ జల్లయ్య అంత్యక్రియలకు వెళ్లకుండా టీడీపీ నేతలను అడ్డుకున్నారు పోలీసులు. టీడీపీ నేతలు మాత్రం తాము ఖచ్చితంగా అధిక సంఖ్యలో నారా లోకేష్ పర్యటనలో పాల్గొంటామని ఘంటాపథంగా చెబుతున్నారు.

Double Bed Room Issue: విసిగిపోయారు.. ఇంటి తాళాలు ప‌గ‌ల‌గొట్టారు..

Exit mobile version