Site icon NTV Telugu

జనం కంటే.. జ‌గ‌న్ కు ధనమే ముఖ్యం: నారా లోకేష్ సెటైర్‌

జ‌గ‌న్ స‌ర్కార్ పై టీడీపీ యువ నేత నారా లోకేష్‌ మ‌రోమారు నిప్పులు చెరిగారు. వైసీపీ ఇసుకాసురుల అక్రమాలకు అడ్డుఅదుపు లేకుండా పోతుందని మండిప‌డ్డారు నారా లోకేష్‌. అన్నమయ్య ప్రాజెక్ట్ బాధితుల కన్నీళ్లు ఆరకముందే గ్రామాల్లో ఇసుక ట్రాక్టర్లు క్యూ కట్టాయంటే.. సీఎం జ‌గ‌న్ కు జనం కంటే ధనమే ముఖ్యమని అర్థం అవుతోందంటూ చుర‌క‌లు అంటించారు.

వైసీపీ నాయకుల ధనదాహానికి 39 మంది జల సమాధి అయ్యారని… 12 గ్రామాలు నీట మునిగాయి, రూ.1721 కోట్ల నష్టం వాటిల్లిందని ఆగ్ర‌హించారు. బాధితులకు కనీస న్యాయం జరగకముందే కడప జిల్లా నందలూరు మండలం, ఆడవూరు క్వారీలో ఇసుక విక్రయాలు ప్రారంభించారని ఫైర్ అయ్యారు. జల ప్రళయానికి కారణమైన ఇసుక మాఫియాని కట్టడి చేయాల్సిన‌ ప్రభుత్వమే వారికి అండ నిలవడం బాధాకరమ‌ని పేర్కొన్నారు.

Exit mobile version