కర్నూలు జిల్లాలోని డోన్ రైల్వేస్టేషన్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్టేషన్ లో అల్లరి మూకల వ్యక్తులు అరాచకం సృష్టించారు. రాత్రి నిద్రిస్తున్న మహిళను లాక్కెళ్లేందుకు అల్లరి మూకలు ప్రయత్నించారు. దీంతో అడ్డుకున్న భర్తపై దాడి చేసి మరో మహిళను లాక్కెళ్లేందుకు అల్లరి మూక ప్రయత్నం చేశారు. మహిళ కేకలు వేసి గొడవ చేయడంతో.. మహిళ కొడుకును ఎత్తుకువెళ్లే ప్రయత్నం చేశారు.
ఇద్దరి మధ్య తోపులాట జరగడంతో మెట్టుకు మహిళ తల తగిలి మృతి చెందడంతో… యువకులు పరారయ్యాడు. స్టేషన్ బయట మెట్ల వద్దనే రాత్రి నుంచి మృతదేహం పడి ఉండడంతో.. ఘటన స్థలం తమది కాదంటే తమది కాదని స్థానిక పోలీసులు, రైల్వే పోలీసుల మధ్య వివాదంకు దిగారు. అయితే మృతురాలి కుమారుని ఐసీడీఎస్ అధికారులు చేరదీశారు.