Site icon NTV Telugu

ఏపీలో 40 శాతం తగ్గిన మద్యం అమ్మకాలు…

ఏపీలో మద్యం విమోచన ప్రచార కమిటీ ఆధ్వర్యంలో మద్యం వద్దు-కుటుంబం ముద్దు కార్యక్రమంలో చైర్మన్ లక్ష్మణ రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలో భారీ గా మధ్యం అమ్మకాలు తగ్గాయి. గత రెండు సంవత్సరాలుగా మద్యం అమ్మకాలు 40 శాతం, బీరు అమ్మకాలు 78 శాతం తగ్గాయి అని చెప్పారు. చంద్రబాబు హయంలో భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నెలకు ముప్పై నాలుగు లక్షల కేసులు మద్యం అమ్మకాలు జరగ్గా… నేడు 21 లక్షల కేసులకు అమ్మకాలు తగ్గాయి. బీర్ అమ్మకాలు 17 లక్షల కేసుల నుండి ఏడు లక్షల కేసులకు తగ్గాయి అన్నారు.

బెల్టు షాపులు సములంగా నిర్మూలించాము. గత ప్రభుత్వం లో మద్యం షాపులు ఉదయం 9 నుండి 11 గంటల వరకు ఉంటే… ఇప్పుడు 11 నుండి 8 వరకే ప్రభుత్వ మద్యం షాపులు తెరుస్తున్నాము. నాటు సారా గంజాయి ఇతర మాదకద్రవ్యలపై ఉక్కుపాదం మొపుతున్నాం. మద్య విమోచన ప్రచారం ద్వారా కళశాలలు వర్సిటీల్లో సాంస్కృతిక బృందాలు ద్వారా యువతకు అవగాహన కల్పిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 15 డి అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఒక్కో కేంద్రంలో రోజుకు 25 నుండి 30 మంది వరకు చికిత్స అందిస్తున్నాము. మద్యం అక్రమాలపై, మత్తు పానీయాల పై టోల్ ఫ్రీ నెంబర్ 14500 కు ఫిర్యాదు చేస్తే సత్వర చర్యలు చేపడతాం. గంజాయి సాగు రవాణాపై 220 కేసులు నమోదు చేసి 364 మంది నిందితులను అరెస్టు చేశాం. నిందితులు దగ్గర నుండి 18, 686 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నాం అని పేర్కొన్నారు.

Exit mobile version