Site icon NTV Telugu

కేంద్ర మంత్రులకు సీఎం జగన్‌ లేఖలు..

YS Jagan

అమరావతి : కేంద్ర జలవనరుల మంత్రి షెకావత్‌, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ లకు వేర్వేరుగా సీఎం జగన్ లేఖలు రాశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం సందర్శనకు వస్తామని కృష్ణా బోర్డు తరచు అడగటాన్ని తప్పుబట్టారు సీఎం జగన్‌. తెలంగాణలోని అక్రమ ప్రాజెక్టు ప్రాంతాల్లో పర్యటించాల్సిందిగా ఏపీ చేసిన అభ్యర్థనను కేఆర్ఎమ్బీ పట్టించుకోవటం లేదని లేఖలో ఆక్షేపించిన సీఎం జగన్… తెలంగాణలోని అక్రమ ప్రాజెక్టు ప్రాంతాల్లో పర్యటించిన తర్వాతే… రాయలసీమ ఎత్తిపోతల పథకం సందర్శించే విధంగా ఆదేశించాలని కేంద్ర మంత్రి షెకావత్ కు విజ్ఞప్తి చేశారు.

read also : ఏపీలో కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు..

అలాగే.. ఉమ్మడి రిజర్వాయర్లలో సాగు, తాగు, విద్యుత్ ఉత్పత్తికి నీటి వినియోగాన్ని కృష్ణా బోర్డు పరిధిలోని తీసుకుని రావాలని కోరారు. ప్రాజెక్టుల భద్రత పర్యవేక్షణ బాధ్యత సీఐఎస్ఎఫ్ పరిధిలోకి తీసుకుని రావాలని లేఖలో పేర్కొన్నారు సీఎం జగన్‌.

Exit mobile version