Site icon NTV Telugu

Leopard Wandering: కుప్పంలో చిరుత కలకలం.. ఆలయంలో పులి పాదాల గుర్తు

Kuppam Taiger

Kuppam Taiger

చిత్తూరు జిల్లా కుప్పంలో చిరుత కలకలం ప్రజలకు భయభ్రాంతులకు గురి చేస్తుంది. పాతపేటలోని సోమేశ్వరస్వామి ఆలయంలోకి ప్రవేశించిన చిరుత అక్కడ కొంతసేపు సంచరించినట్లుగా తెలుస్తోంది. అయితే.. రోజూ తెల్లవారుజామున ఆలయం తలుపులు తెరవడానికి వెళ్లిన పూజారికి ఒక్క సారిగా ఉలిక్కి పడ్డాడు. ఆలయంలో చిరుత పులి పాదాల గుర్తులు కనిపించడంతో.. ఖంగుతిన్నాడు. పులి లోపలే వుందా లేక సంచరించిందా అనే ఆలోచన పూజారికి భయాందోళకు గురయ్యేలా చేసింది.

దీంతో.. భయాందోళనకు గురైన పూజారి అక్కడి నుంచి బయటకొచ్చేశారు. దీంతో.. అదే సమయంలో చిరుత గుడిలో నుంచి గోడదూకి పారిపోయినట్లుగా పూజిరి చెప్తున్నారు. ఇక ఆలయంలో చిరుత పులి పాదాల గుర్తులు కనిపిస్తున్నాయి. అయితే.. చుట్టుపక్కల ప్రాంతాల వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇక సమాచారం అందుకున్న ఫారెస్ట్‌ అధికారులు చిరుత కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు.
Gautam Adani: ప్రపంచ కుబేరుల జాబితా.. మూడో స్థానానికి ఎగబాకిన అదానీ.. టాప్‌ 10లో లేని అంబానీ

Exit mobile version