కరోనా మహమ్మారికి ఎక్కడ ఎలాంటి మందు ఇస్తున్నారని తెలిసినా అక్కడికి పరిగెత్తుకు వెళ్తున్నారు ప్రజలు. ఆనందయ్య మందు కరోనాకు పనిచేస్తుందిని ప్రచారం జరగడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి రానివి ఇంకా చాలానే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే, పులివెందులలో కరోనా నివారణకు ఆకు పసరు పేరుతో మందు పంపిణీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పులివెందుల ఆర్డీవో నాగన్న పసరు పంపిణీని అడ్డుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా పసరును ప్రజలకు ఎలా సరఫరా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటికి అనుమతులు తప్పనిసరి అని లేకుంటే చట్టపరమైర చర్యలు ఉంటాయని నిర్వాహకులను హెచ్చరించారు. సోషల్ మీడియాలో కరోనాకు పులివెందుల మందు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో చాలామంది ఈ ఆకు పసరుకోసం పులివెందులకు చేరుకోవడంతో అధికారులు అడ్డుకున్నారు.
కరోనాకు పులివెందులలో ఆకు పసరు…సోషల్ మీడియాలో వైరల్…
