పీఆర్‌సీపై నివేదిక ఇస్తేనే ఇండ్లకు వెళుతామని పట్టుబట్టిన ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు వెనుదిరిగారు. ఏపీ సెక్రటేరియల్‌లో సుమారు 5 గంటల పాటు నిరీక్షించిన ఉద్యోగ సంఘాల నేతలు సీఎస్ నుంచి ఎలాంటి సమాచారం రాలేదని ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు వాపోయారు.
రేపు ఉద్యోగ సంఘాలతో సమావేశమవుతామని, కార్యచరణను రూపొందిస్తామని ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు ప్రకటించారు. 11వ పీఆర్‌సీపై రెండేళ్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం శోచనీయమన్నారు.