Land Dispute : గుంటూరులో భూవివాదానికి రాజకీయరంగు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుంటూరు జిల్లాలో ఓ భూవివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. తాడేపల్లిలోని ఓ ప్రాంతంలో తమ భూమిలో నాగి రెడ్డి అనే వ్యక్తి దౌర్జన్యంగా ఆక్రమించే ప్రయత్నం చేశాడని , తమ పై దాడి చేశాడని కోటేశ్వరావు అనే వ్యక్తి ఆరోపించాడు. ఈ నేపథ్యంలోనే నాగిరెడ్డి అనే వ్యక్తిపై అతనికి మద్దతు ఇస్తున్న వారిపై కోటేశ్వరరావు రాజకీయంగా ఆరోపణలు చేయడంతో ఇప్పుడు వివాదం రాజకీయ రంగు పులుముకుంది.
గుంటూరు జిల్లా తాడేపల్లి లోని పొలకం పాడులో ఓ భూ వివాదం టీడీపీ వర్సెస్ వైసీపీ పార్టీల పోరుగా మారుతోంది. తాడేపల్లి ప్రాంతానికి చెందిన కోటేశ్వర రావు, శ్రీనివాస రావు అన్నదమ్ములు. తండ్రి నుంచి వారసత్వంగా సంక్రమించిన ఆస్తి ఏడు సెంట్ల స్థలంలో అన్నదమ్ములు ఇద్దరికీ వాటా ఉంది. అయితే ఇందులో శ్రీనివాస్ రావ్ అనే వ్యక్తి నాగిరెడ్డి అనే వ్యక్తికి స్థలం అమ్మేశాడనీ మిగిలిన భాగం కోటేశ్వర రావు పేరుతో ఉంది. అయితే తమ్ముడు శ్రీనివాసరావును భూమి అమ్మడానికి వీలు లేదని అన్న కోటేశ్వరరావు చెప్పడంతో కోటేశ్వరరావు, శ్రీనివాసరావు కుటుంబాల మధ్య గత కొంత కాలంగా వివాదం నడుస్తోంది.
Also Read
- IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్‌గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
- Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
ఈ వివాదాల నేపథ్యంలో నాగి రెడ్డి అనే వ్యక్తి తమ ఇంటిపై దౌర్జన్యానికి వచ్చాడని, దాడి చేసి మమ్మల్ని కొట్టాడని కోటేశ్వర రావు ,అతని కుటుంబం ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ కావడం… ఆ తర్వాత కోటేశ్వరరావు టిడిపి నాయకులతో కలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగిపోయాయి. భూ యజమాని కోటేశ్వరరావు చేసిన ఆరోపణల పై స్పందించిన స్థానిక ఎమ్మెల్యే ఆర్కే ఘటన స్థలానికి చేరుకుని అక్కడ స్థానికులతో మాట్లాడారు.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి జరిగిన విషయం పై మీడియాకి వివరణ ఇచ్చారు. నాగిరెడ్డి కొనుక్కున్న భూమి లోకి వెళ్లేందుకు వస్తుంటే కోటేశ్వరరావు అడ్డుకునే ప్రయత్నం చేశాడని, పైగా ఈ చిన్న భూ వివాదాన్ని పార్టీల వివాదంగా మార్చి లబ్ధి పొందాలని కోటేశ్వరరావు అతని కుటుంబం చూస్తున్నారని ఎమ్మెల్యే ఆర్కే ఆరోపిస్తున్నారు. మొత్తంగా అన్నదమ్ముల కుటుంబాల మధ్య ఓ చిన్న వివాదం చిలికి చిలికి గాలివానలా మారి ఇప్పుడు రెండు రాజకీయ పార్టీలకు వివాద వేదికగా మారింది. దీనిపై పోలీసులతో దర్యాప్తు చేయించి అసలు కారణాలు బయట పెడతానని అంటున్నారు ఎమ్మెల్యే ఆర్కే.
తాజావార్తలు
-
Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్‌కుమార్‌పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
-
Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్‌ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
-
IND Vs AFG: అదరగొట్టిన భారత బ్యాటర్లు.. తొలిరోజే రెండు సెంచరీలు..
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
-
Dimple Choudhary: ప్రముఖ డ్యాన్సర్‌తో అనుచిత ప్రవర్తన.. స్టేజ్‌పై కీచకుడి చెంపపగలగొట్టిన నర్తకి
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!