Site icon NTV Telugu

Kurnool Bus Accident: కర్నూలులో ఘోర బస్సు ప్రమాదం.. రాష్ట్రపతి, ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి!

Murmu

Murmu

Kurnool Bus Accident: కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు చెలరేగి వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. బైక్ ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి.. మంటల్లో వోల్వా బస్సు పూర్తిగా కాలి బూడిదైంది.. ఈ ఘటనలో 20 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం తనను తీవ్రంగా కలచివేసిందని రాష్ట్రపతి ముర్ము అన్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ఆకాంక్షించారు.

Read Also: Pradeep Ranganathan : పాన్ ఇండియా ‘హ్యాట్రిక్ స్టార్’ ప్రదీప్ రంగనాథన్

అలాగే, ఈ ఘటనపై ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ కూడా రియాక్ట్ అయ్యారు. జరిగిన ఈ ఘోర బస్సు ప్రమాదం తనను దిగ్భ్రాంతికి గురి చేసింది అన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆయన.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలన్నారు. ఇక, కర్నూలు బస్సు ప్రమాదంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. క్షతగాత్రులకు రూ. 50 వేల తక్షణ సాయం అందజేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు.

Exit mobile version