NTV Telugu Site icon

MLA Bhuma Akhila Priya: విజయ పాల డైరీ చైర్మన్పై ఆగ్రహం వ్యక్తం చేసిన భూమా అఖిల ప్రియ

Akila Priya

Akila Priya

MLA Bhuma Akhila Priya: కర్నూల్ జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఆమె మామ జగన్ మోహన్ రెడ్డి మధ్య మరోసారి మాటల యుద్ధం స్టార్ట్ అయింది. భూమా అఖిలప్రియ నంద్యాల పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అయితే, ఎమ్మెల్యే అఖిలప్రియ నంద్యాలలో ఉన్న విజయ పాల డైరీ పరిశ్రమను నిన్న (మంగళవారం) ఆకస్మికంగా తనిఖీలు చేసింది. డైరీలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫొటోలు ఉండటంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే జగన్ ఫొటోలను తొలగించి.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటోలను పెట్టాలని ఆదేశించింది. ఇక, మాజీ సీఎం ఫొటోలు పెట్టిన సిబ్బందిపై మండిపడింది. దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ శిలాఫలకాన్ని తొలగించి మురికి కాలువలో పడేసిన వారిని వదిలేదని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ వార్నింగ్ ఇచ్చారు.

Read Also: Bahraich Violence : బహ్రైచ్ హింసలో ఇప్పటివరకు 50 మంది అరెస్టు.. కొనసాగుతున్న ఇంటర్నెట్ బంద్

అయితే, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వచ్చిన విషయం తెలుసుకున్న విజయ పాల డైరీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి ఆమెకు కాల్ చేశారు. తన సీటులో ఎలా కూర్చుంటావని అఖిలప్రియను క్వశ్చన్ చేశారు. సిబ్బంది కూర్చోమంటేనే కూర్చుకున్నానని ఆమె సమాధానం ఇచ్చింది. జగన్ అంతటితో ఆగకుండా.. తనను అడగకుండా కూర్చోడానికి నువ్వెవరంటూ సీరియస్ అయ్యారు. గతంలో మా కుర్చీలో మీరు కుర్చేలేదా అని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే ప్రశ్నించారు. బెదిరిస్తున్నావా.. నన్ను కుర్చీలో నుంచి కదపండి చూద్దామని భూమ అఖిల ప్రియ సవాల్ చేశారు. ఈ ఫోన్ సంభాషణ ఒక్కసారిగా రాజకీయ వివాదానికి దారి తీసింది.