Site icon NTV Telugu

Kurnool: బైక్‌ల మాయాజాలం: కోడుమూరు పోలీస్ స్టేషన్‌లో వెలుగులోకి కానిస్టేబుల్ అక్రమాలు..

Kodumuro

Kodumuro

Kurnool: కర్నూలు జిల్లా కోడుమూరు పోలీస్ స్టేషన్‌లో ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పలు కేసుల్లో సీజ్ చేసిన బైక్‌లను కానిస్టేబుల్ జగదీష్ విక్రయించిన విషయం బయటపడింది. అయితే, బైక్ యజమానులు ఒరిజినల్ ఆర్సీ పత్రాలతో పోలీస్ స్టేషన్‌కు రాగానే ఈ వ్యవహారం బయటపడింది. గతంలో ఆదోని పీఎస్‌లో పనిచేసినపుడు కూడా జగదీష్‌పై ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నట్లు తెలుస్తుంది.

Read Also: Arshdeep Singh: 8 నెలల నిరీక్షణకు తెర.. T20లో అర్ష్‌దీప్ సింగ్ సెంచరీ..

అయితే, సీజ్ చేసిన బైక్‌లను కోడుమూరులోనే పలువురికి అమ్మినట్లు తెలుస్తుంది. బైక్ అమ్మకాల వ్యవహారం మొత్తం బయటపడడంతో వారి నుంచి 5 బైక్‌లను పోలీస్ ఉన్నతాధికారులు రికవరీ చేశారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి ప్రస్తుతం అధికారులు విచారణ చేస్తున్నారు. ఇక, నెల రోజుల క్రితం కూడా సీజ్ చేసిన ఒక స్కూటీని ఓ హెడ్ కానిస్టేబుల్ విక్రయించిన ఘటన కూడా తాజాగా వెలుగులోకి వచ్చింది.

Exit mobile version