NTV Telugu Site icon

Kurnool Job Fraud: ఉద్యోగాల పేరుతో భారీ మోసం.. వెయ్యి మందికి టోకరా

Job Scam

Job Scam

Kurnool Police Arrested 5 Fraudsters Who Cheated In The Name Of Jobs: ఉద్యోగ అవకాశాల కోసం నిరుద్యోగులు పడుతున్న తంటాలు అన్నీ ఇన్నీ కావు. తిరగని కన్సల్టెన్సీలు ఉండవు, వెళ్లని ఇంటర్వ్యూ ఉండదు. చివరికి ప్రయత్నాలు బెడిసికొడుతుండటంతో.. డబ్బులు ఇచ్చైనా ఉద్యోగాలు సంపాదిద్దామనే దుస్థితికి వచ్చేశారు. దీన్నే కొందరు దుండగులు క్యాష్ చేసుకుంటూ.. భారీ మోసాలకు పాల్పడుతున్నారు. ప్రత్యేకంగా నిరుద్యోగుల్ని టార్గెట్ చేసుకొని, మంచి ప్యాకేజ్‌తో గొప్ప ఉద్యోగాలు అందిస్తామని నమ్మబలుకుతూ, వారికి కుచ్చటోపీ పెడుతున్నారు. లక్షలకు లక్షలు దోచుకున్న తర్వాత.. కంటికి కనిపించకుండా మాయమైపోతున్నారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే.. తాజాగా మరొకటి చోటు చేసుకుంది. వంద కాదు, రెండు వందలు కాదు.. ఉద్యోగాల పేరుతో తెలుగు రాష్ట్రాలకు చెందిన వెయ్యి మందిని నిలువునా దోచుకున్నారు కొందరు దుండగులు. ఆ వివరాల్లోకి వెళ్లే..

Kurnool Incident: కర్నూలులో షాకింగ్ ఘటన.. బతికున్న కూతురిని తల్లి ఖర్మకాండ

కొందరు నిందితులు కలిసి.. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఒక కన్సల్టెన్సీ కంపెనీని ఓపెన్ చేశారు. ఆన్‌లైన్‌లో బాగా ప్రచారం చేశారు. ‘‘భారీ ప్యాకేజ్‌తో మంచి ఉద్యోగం సంపాదించుకునే సువర్ణవకాశం పొందండి’’ అంటూ పోస్టులు పెట్టారు. అది చూసిన కొందరు నిరుద్యుగులు.. వారిని సంప్రదించారు. తమకు కొంత మొత్తం చెల్లిస్తే.. పెద్ద పెద్ద కంపెనీల్లో, మంచి పొజిషన్‌లోనే ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించారు. ఇలా వెయ్యి మందిని నమ్మించి.. వారి వద్ద నుంచి ఏకంగా రూ.53 లక్షలు వసూలు చేశారు. ఈ ప్రాసెస్ మొత్తం నిజమని నమ్మించేందుకు.. ఏవేవో అప్లికేషన్‌లు, డూప్లికేట్ ఆఫర్ లెటర్లు తయారు చేశారు. తీరా మోసపోయామని గ్రహించిన బాధితులు.. పోలీసుల్ని ఆశ్రయించారు. నాగపులయ్య అనే వ్యక్తి కర్నూలు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. తమదైన శైలిలో విచారణ జరిపి, ఐదుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారి అకౌంట్లను కూడా ఫ్రీజ్ చేశారు.

Adluri laxman : మీరు నిరూపిస్తే నేను కోర్టులో ఉన్న నా ఎలక్షన్ పిటిషన్ వెనక్కి తీసుకొంటా