Site icon NTV Telugu

పిచ్చి బ్రాండ్లు తగ్గిస్తే మంచిది : తమ్మినేనికి కూన రవికుమార్ కౌంటర్

Kuna Ravikumar

Kuna Ravikumar

తమ్మినేని పై మళ్లీ కౌంటర్ అటాక్ కు దిగారు కూనరవికుమార్. జగనన్న భూమ్, జామ్ మందులు తాగడం మానుకోవాలని… పిచ్చి మందు తాగి తమ్మినేని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు. పిచ్చి బ్రాండ్లు తాగడం తగ్గిస్తే మంచి మాటలొస్తాయని… మొక్కలు ఆక్సిజన్ పీల్చుకుంటాయనడం ఈ మందు ప్రభావమేనని తెలిపారు. ‘నన్ను పాతాళంలోకి తొక్కేయడం నీ అబ్బతరం కూడా కాదు…నా కాలు బొటనవేలు మీదున్న వెంట్రుక కూడా పీకలేవు ‘ అంటూ కూన రవి కూమార్‌ మండిపడ్డారు.

read also : అలర్ట్‌ : మరో మూడు రోజుల పాటు వర్షాలు

ఉన్నతమైన పదవిలో ఉన్నప్పుడు నోరు సంభాషించుకుని మాట్లాడాలని.. ఇప్పటికైనా పిచ్చి బ్రాండ్లు తాగడం మానుకోవాలని చురకలు అంటించారు. తమ్మినేని తాగుబోతు మాటలు విని ఊరుకోవడానికి తానేమీ అల్లాటప్పాగాడిని కాదని… నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే తొక్కడం కాదు….నలిపేస్తామని హెచ్చరించారు. నువ్వు తొక్కేస్తా…పీకేస్తా అంటే తొక్కించుకోవడానికి ఇక్కడెవరూ సిద్దంగా లేరని.. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే తమ్మినేని బండారం అందరి ముందూ బయటపెడతా అని పేర్కొన్నారు.

Exit mobile version