NTV Telugu Site icon

కుంభమేళాను సింబాలిక్ గా జరపండి : మోడీ

హరిద్వార్ పవిత్ర కుంభమేళ  మీద కరోనా మహమ్మారి పంజా విసిరింది. రోజువారీ రికార్డు స్థాయి కేసులు నమోదవుతున్నాయి. పలువురు సాధువులకు కరోనా సోకింది. ఈనెల 27న మరోసారి షాహీస్నాన్‌ ఉండడంతో.. కరోనా వ్యాప్తి చెందకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కరోనా నేపథ్యంలో  కుంభమేళా ముగించకపోవడంపై.. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లక్షలాది మంది భక్తులు పవిత్ర స్నానాలు చేస్తుండడంతో… రాకాసి వైరస్ విస్తరిస్తోంది.కుంభమేళాలో పాల్గొన్న 30 మంది నాగసాధువులకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆల్‌ ఇండియా అఖాడా పరిషత్‌ నాయకుడు మహంత్‌ నరేంద్ర గిరి కరోనాతో రిషికేశ్‌లోని ఎయిమ్స్‌లో చేరారు. నిరంజినీ, జునా సహా దాదాపు అన్ని అఖాడాల్లోని సాధువులు వైరస్ బారిన పడ్డారు. మిగిలిన వారికి పరీక్షలు చేస్తున్నట్లు హరిద్వార్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. 

కరోనా విజృంభణ నేపథ్యంలో నిరంజన్ అఖాడా సాధువుల బృందం కుంభమేళాను వీడేందుకు సిద్ధమైంది. అఖాడాలో చాలా మందికి కొవిడ్‌ లక్షణాలు కన్పిస్తున్నాయని.. అఖాడా ప్రతినిధులు తెలిపారు. మరోవైపు మహా నిర్వాణి అఖాడా హెడ్‌, ప్రముఖ సాధువు స్వామి కపిల్‌ దేవ్‌ కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన చికిత్స నిమిత్తం రిషికేష్‌లో చేరారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి డెహ్రాడూన్‌లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. 

ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీనిపై స్పందించారు. ప్రస్తుత మహమ్మారి కఠిన పరిస్థితుల్లో కుంభమేళాను ప్రతీకాత్మకంగా అంటే సింబాలిక్ గా జరపాలంటూ సాధువులను కోరారు. కుంభమేళాలో పాల్గొన్న సాధువుల్లో అనేక మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. దీంతో ప్రధాని మోదీ జునా అఖాడా హెడ్‌ స్వామి అవధేశానంద్‌ గిరితో ఫోన్లో మాట్లాడారు. ఈ విషయాన్ని మోదీ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. సాధువుల ఆరోగ్యంపై ఆరా తీసిన ప్రధాని.. వారికి ప్రభుత్వం అన్ని విధాలా వైద్యసాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. కుంభమేళాను కుదించేలా చూడాలని మోదీ ఆయనను కోరారు.

ఇక కుంభమేళా ప్రాంతంలో గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో కొవిడ్‌ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఏప్రిల్‌ 10 నుంచి 15 వరకు 2 వేల వందమందికి పైగా భక్తులు వైరస్‌ బారినపడ్డారు. ఇటీవల షాహీ స్నాన్‌ సందర్భంగా .. లక్షల సంఖ్యలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. కాగా.. కొవిడ్‌ కేసులు పెరుగుతున్నప్పటికీ కుంభమేళాను ఇంకా ముగించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.