Site icon NTV Telugu

Kodali Nani: కొడాలి నాని అరెస్ట్‌పై క్లారిటీ ఇచ్చిన పోలీసులు..

Kodali Nani

Kodali Nani

Kodali Nani: వివిధ కేసుల్లో వరుసగా వైసీపీ నేతలు అరెస్ట్‌ అవుతున్న సమయంలో.. మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కొడాలి నానిని కూడా అరెస్ట్‌ చేశారనే ప్రచారం సోషల్‌ మీడియాలో గుప్పుమంది.. కోల్‌కతాలో కొడాలి నానిని అరెస్ట్ చేశారనే వార్తలు హల్‌చల్‌ చేశాయి.. అయితే, దీనిపై క్లారిటీ ఇచ్చారు కృష్ణా జిల్లా పోలీసులు.. కొడాలి నాని అరెస్టు అని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్త అవాస్తవమని తేల్చారు జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు.. మాజీ మంత్రి కొడాలి నానిపై ఉన్న కేసుల నేపథ్యంలో ఆయనున్న కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో అరెస్టు చేశారంటూ సోషల్‌ మీడియా వేదికగా వస్తున్న వార్తలు అవాస్తవం… అలా ప్రచురితం అవుతున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని జిల్లా ఎస్పీ గంగాధరరావు తెలియజేశారు. ఒకవేళ కొడాలి నానిని అరెస్టు చేస్తే ఆ సమాచారాన్ని అధికారికంగా తెలియజేస్తాం అన్నారు.. అంతేకానీ ఇలాంటి నిరాధారమైన వార్తలను సామాజిక మాధ్యమాలలో షేర్ చేసినా, పోస్ట్ చేసినా అటువంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి చర్యలకు పాల్పడిన వారు ఎవరినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు ఎస్పీ గంగాధరరావు..

Read Also: Hyderabad: ముసలోడే కానీ మహా ముదురు..70 ఏళ్ల వయసులో ఏంటి ఈ దుర్బుద్ధి..?

Exit mobile version