Site icon NTV Telugu

YS Jagan Tour: జగన్ పర్యటనపై పోలీసుల షరతులు

Ys Jagan

Ys Jagan

YS Jagan Tour: కృష్ణాజిల్లాలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనపై పోలీసులు కొన్ని షరతులు పెట్టారు. ఈ సందర్భంగా మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాలైన గూడూరు మండలం రామరాజు పాలెం, ఆకుమర్రు గ్రామం, సీతారామపురం, ఎస్ఎన్ గొల్లపాలెం గ్రామాలలో పర్యటన కొరకై గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఈ కింది షరతులతో కూడిన అనుమతి ఇవ్వడం జరిగింది అని పోలీసులు తెలియజేశారు.

Read Also: Warangal: వరంగల్‌లో మొంథా తుఫాన్ బీభత్సం.. ఏకంగా 6465 ఇళ్లు..

ఇక, హైవేపై ప్రజలు గుమిగుడటానికి, సమావేశాలకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో హైవేపై వాహనాల రాకపోకలకు, ప్రజలకు ఎటువంటి అంతరాయం కలిగించారదన్నారు. . కేవలం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు. రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్.ఎన్ గొల్లపాలెంలో మాత్రమే జగన్ పర్యటన చేయాలని చెప్పుకొచ్చారు. దీంతో పాటు 10 కాన్వాయ్ వాహనాలకు, 500 మందికి మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగింది అని పోలీసులు షరతులు విధించారు.

Read Also: Police Open Fire: కోయంబత్తూరులో యువతిపై అత్యాచారం… నిందితులపై కాల్పలు

అలాగే, వైఎస్ జగన్ పర్యటనలో బైక్ ర్యాలీకి పర్మిషన్ లేదని పోలీసులు వెల్లడించారు. పరిమితికి మించిన ప్రజలను, వాహనాలను వినియోగించినా, మేము ఇచ్చిన అనుమతిని మితిమీరినా వెంటనే ఆ కార్యక్రమాన్ని రద్దు చేయడం జరుగుతుందన్నారు. ఈ పర్యటనలో డీజేను వినియోగించొద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఏదైనా సంభవిస్తే దానికి ఈ ప్రోగ్రాం నిర్వాహకులదే పూర్తి బాధ్యత అన్నారు.

Exit mobile version