Ex-Minister Jogi Ramesh: కృష్ణ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలోని ఫ్లయాష్ (బూడిద) డంపింగ్ యార్డ్ టెండర్లలో అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. దీని వల్ల పరిసర ప్రాంతాలు మొత్తం కలుష్య సమస్యతో అల్లాడుతుందని ఆరోపించారు. దీంతో ఆ బూడిద డంపింగ్ యార్డు సందర్శనకు వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేసిన పీఎస్ కి తరలించారు. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో భవానీపురం పోలీస్ స్టేషన్ నుంచి మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ విడుదల అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. వీటీపీఎస్‌లో ఫ్లయాష్ టెండర్లు రద్దు చేయాలని, అక్రమంగా బూడిద నిల్వ చేసి హైదరాబాద్‌కి తరలించే ప్రక్రియను నిలిపివేయాలని మాజీ మంత్రి జోగి రమేష్ డిమాండ్ చేశారు.
Read Also: Bollywood : ఆషీకీ 2 డైరెక్టర్ తో గొడవ.. ఛావా దర్శకుడికి గ్రీన్ సిగ్నల్
ఇక, ఈ బూడిద డంపింగ్ యార్డు వల్ల ఇబ్రహీంపట్నం పరిసరాల్లోని గ్రామాల్లో నీరు, గాలి కాలుష్యం బారిన పడే అవకాశం ఉంది అని వైసీపీ నేత జోగి రమేష్ తెలిపారు. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు పూర్తిగా దెబ్బ తింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్యం నుంచి సురక్షింగా ఉండాలంటే, గ్రామాలను ఆదుకోవాలి, చెట్లు పెంచాలని కోరుతున్నాం, తక్షణమే అక్రమ డంపింగ్ ను స్వాధీనం చేసుకోకపోతే మా పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. లోకల్ లారీ ఓనర్స్ ను ఆదుకునే విధంగా టెండర్లు రద్దు చేసే వరకు పోరాటం చేస్తామన్నారు. అలాగే, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు చెపితే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని జోగి రమేష్ వెల్లడించారు.
