Budameru Canal: కృష్ణా జిల్లా గన్నవరంలో గూడవల్లి వద్ద బుడమేరు కాలువ కట్ట తెగిపోయింది.. దీంతో.. బుడమేరు కాలువ నుంచి జాతీయ రహదారి 16పైకి వరద నీరు చేరుతుంది.. నిడమానూరు నుండి గూడవల్లి వరకు జాతీయ రహదారిపైకి వరద నీరు చేరిపోయింది.. దీంతో.. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.. మరోవైపు.. రామన్ భవన్ 2 కాలేజీలోకి ప్రవేశించింది బుడమేరు వరద నీరు.. ఇంకోవైపు.. శ్రీ చైతన్య కాలేజీలోకి కూడా బుడమేరు వరదనీరు వచ్చి చేరింది.. దీంతో.. కాలేజీకి సెలవు ప్రకటించి.. విద్యార్థులను ఇంటికి పంపిస్తున్నారు చైతన్య కాలేజ్ యాజమాన్యం.. కాలేజీలో నుండి గూడవల్లి వద్ద జాతీయ రహదారిపైకి చేరుతోంది బుడమేరు కాలువలోని వరద నీరు… జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు.. ఇలాగే వరద ఎక్కువ కొనసాగితే.. విజయవాడ నుండి ఏలూరు వెళ్లే జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరే ప్రమాదం ఉంది.. ట్రాఫిక్ క్లియరెన్స్ కష్టంగా మారే అవకాశం ఉందంటున్నారు అధికారులు..
Read Also: Baburaj: సినీ అవకాశం ఇప్పిస్తానని రేప్ చేశాడు.. నటుడిపై యువతి కేసు!!!