NTV Telugu Site icon

Dr BR Ambedkar Konaseema: ఇక, డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ.. గెజిట్‌ విడుదల..

Dr Br Ambedkar Konaseema Di

Dr Br Ambedkar Konaseema Di

ఇక, కోనసీమ జిల్లా పేరు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాగా మార్చింది ప్రభుత్వం.. దీనికి సంబంధించిన తుది గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది ప్రభుత్వం.. మే 18న దీనికి సంబంధించిన ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం, జూన్ 24న రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.. ఇప్పుడు ఫైనల్ గెజిట్ నోటిఫికేషన్ తో ఇక నుంచి డా బీఆర్ అంబేద్కర్ కోనసీమగా జిల్లాగా మార్చేసింది.. కాగా, ఇటీవల జిల్లాల పునర్‌వ్యస్థీకరణలో అమలాపురం పార్లమెంటు నియోజకవర్గాన్ని కోనసీమ జిల్లాగా ఏర్పాటు చేసింది వైఎస్‌ జగన్‌ సర్కార్.. తూర్పుగోదావరి జిల్లా నుంచి అమలాపురం ప్రాంతాన్ని వేరుచేసి ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేశారు.. అయితే, ఈ జిల్లాకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టాలని పెద్దఎత్తున వినతులు వచ్చాయి. దీంతో.. కోనసీమ జిల్లాకు అంబేద్కర్‌ పేరు పెట్టడానికి ప్రభుత్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.. ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసి.. కోనసీమ జిల్లా పరిధిలో నివసించేవారు 30 రోజుల్లోపు సూచనలు, అభ్యంతరాలు తెలపాలని పేర్కొంది.. కానీ, ఆ తర్వాత జరిగిన ఆందోళనలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. ఈ ఆందోళనల్లో మంత్రి విశ్వరూప్‌ ఇల్లుకు నిప్పుపెట్టడం పెద్ద దుమారమే రేపింది.. కొంత కాలం.. కోనసీమ ముందు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ పేరు ఉంటుందా? ఉండదా? అనే అనుమానాలు వ్యక్తం అయినా.. వెనక్కి తగ్గడకుండా.. డా.బీఆర్‌ అంబేద్కర్‌ కోనసమీ జిల్లాగా మారుస్తూ తుగి గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది ప్రభుత్వం.

Read Also: Common Wealth Games 2022: ఐదో రోజు అదరగొట్టిన భారత్.. ఖాతాలో 2 స్వర్ణాలు, 2 రజతాలు