తిరుపతి : ప్రస్తుతం జన ఆశీర్వాద యాత్రలో బిజీగా ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల జలవివాదం పై సామరస్యంగా పరిష్కరిస్తామని… అభివృద్ధి కోసం రెండు రాష్ట్రాలు సహకరించుకోవాలని కోరారు. రెండు రాష్ట్ర సమస్యల పరిష్కారానికి జగన్, కేసిఆర్ లతో మాట్లాడుతానని పేర్కొన్నారు. కోవిడ్ కారణంగా టూరిజం రంగం తీవ్రంగా నష్టపోయిందని..టూరిజం రంగానికి ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటిస్తామని తెలిపారు.
టూరిజం రంగాన్ని వేగంగా అభివృద్ధి చేస్తామని.. దేఖో అప్ కా దేశ్ అనే పర్యాటక ప్రోగ్రాన్ని త్వరలో తీసుకు వస్తామని హామీ ఇచ్చారు…రైతుల అభివృద్ది కోసం ఎన్నో సంస్కరణల తీసుకోచ్చామని… మేము తీసుకోచ్చిన రైతు చట్టాలను గతంలో కాంగ్రెసు పార్టీ సైతం ప్రస్తావించిందన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో చట్టాలపై చర్చ జరగకుండా ప్రతిపక్షాలు అడ్డుకుంటూన్నాయని మండిపడ్డారు. కోవిడ్ సమయంలో మోడీ స్థానంలో ప్రధానిగా మరొకరిని ఊహించలేమని… కరోనా విషయం లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
జలవివాదం పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Kishan Reddy