రాజమండ్రిలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ సాంస్కృతిక ఉత్సవాల్లో సినీ నటుడు మోహన్ బాబు మాట్లాడారు. ఎందరో కళాకారులు తిండి, ఇళ్లు లేక కష్టాలు పడుతున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కళాకారులను ఆదుకుంటున్నారో లేదో మంత్రి అవంతి శ్రీనివాస్ కు తెలుసు.
తెలంగాణలోనూ జానపద కళాకారులు కష్టాలు పడుతున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కళాకారుల్ని ఆదుకునే బాధ్యత తీసుకోవాలి. నృత్య, జానపద కళాకారుల్ని ఆదుకోవడం ఏపీ, తెలంగాణ నుంచే ప్రారంభించాలి. కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి ఉండటం వల్లే తొలిసారి తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉత్సవాలు
జరుగుతున్నాయి. సభలో ప్రధాని నరేంద్ర మోదీకి జై కొట్టించారు మోహన్ బాబు. 1998లో నేను ఏపీలో బీజేపీకి ప్రచారం చేస్తే 18శాతం ఓట్లు వచ్చాయి. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఉన్నత పదవులు రావాలి. ఆంధ్రప్రదేశ్ సీఎంపై నాకు గౌరవం ఉందన్నారు మోహన్ బాబు.
కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 29, 30 న వరంగల్ , ఏప్రిల్ 1, 2 ,3 తేదీల్లో హైదరాబాద్ లో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహిస్తాం. దేశంలో విభిన్న సంస్కృతి కలయికే జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు. చారిత్రక రాజమండ్రిలో ఈఏడాది ఉత్సవాలు జరపాలి అనుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తున్నాం. విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు కూడా నిర్వహిస్తాం అన్నారు కిషన్ రెడ్డి. 30 కోట్లతో మన్యం వీరుడు అల్లూరి స్మారక కేంద్రాన్ని విశాఖపట్నం జిల్లాలో ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఏడాది 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవ పండుగను జరుపుకుంటాం. ఈ ఏడాది ఆగస్టు 15 నాడు దేశంలో ప్రతి ఒక్కరి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరాలన్నారు.
