Site icon NTV Telugu

ఈతరం రాజకీయనేతలకు స్ఫూర్తి రోశయ్య

మాజీ సీఎం‌ రోశయ్య పార్థివదేహానికి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం కిరణ్ మాట్లాడుతూ… రోశయ్య వాగ్థాటిని తట్టుకోలేక ఎన్టీఆర్ శాసనమండలిని రద్దు చేశారన్నారు. ఎన్నో పదవులు అలంకరించిన వ్యక్తి రోశయ్య. అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలనేది రోశయ్యను చూసి నేర్చుకున్నామని కిరణ్తె కుమార్లి పారు. ఏ పదవి చేసినా.. ఆ పదవికే వన్నె తెచ్చిన వ్యక్తి రోశయ్య అని కిరణ్ కుమార్ రెడ్డి కొనియాడారు.

రోశయ్య వాగ్దాటిని తట్టుకోలేక కౌన్సిల్ రద్దుచేయాల్సిన పరిస్థితి ఆనాడు ఎన్టీఆర్‌కి కలిగిందన్నారు కిరణ్ కుమార్ రెడ్డి. అసెంబ్లీలోనూ సమయస్పూర్తి, ఆయనిచ్చిన సమాధానాలు అందరికీ ఎన్నో నేర్పాయన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలన్నారు.

Exit mobile version