Site icon NTV Telugu

King Cobra Attack: అమ్మో అరుదైన కింగ్ కోబ్రా.. చూస్తేనే ఒళ్ళు జలదరిస్తుంది

Sam (9)

Sam (9)

సాధారణంగా కొందరికి పాములను చూడగానే ఆమడ దూరం పరుగెడతారు. కొందరు దైర్యం చేసి దూరం నుంచే పామును చూస్తుంటారు. మరికొందరు ఏకంగా పామును పట్టుకుంటారు. కింగ్ కోబ్రా నల్లగా పొడవుగా ఉంటుంది. మామూలు పాములను ,నాగు, తాచు పాములను తింటుంటుంది. దీని నోరు కూడా పెద్దగానే ఉంటుంది. స్పీడ్ గా కదులుతుంది.
సాధారణంగా దట్టమైన ఆఫ్రికా అడవుల్లో వీటి సంచారం ఎక్కువగా ఉంటుంది. మనదేశంలో.. కూడా వీటి సంచారం ఎక్కువగానే ఉంటుంది. అయితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా చోట్ల కనిపిస్తుంటాయి.. ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలు, అల్లూరి సీతారామరాజు, విశాఖ, మన్యం జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి.. ఇవి కరిస్తే.. బతకడం మాత్రమే కష్టమే అంటున్నారు నిఫుణులు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. పార్వతీపురం మన్యం జిల్లాలోని ఏజెన్సీ గ్రామమైన సీతంపేటలో ఓ అరుదైన రాచనాగు హల్ చల్ చేసింది. దుర్గా నర్సరీలో సంచరిస్తూ నర్సరీ నిర్వాహకుల కంట పడింది. ఒక్కసారిగా అంత పెద్ద కింగ్ కోబ్రాను చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దాంతో స్పందించిన అటవీశాఖ అధికారులు శ్రీకాకుళం నుండి ఖాన్ అనే స్నేక్ క్యాచర్ ని రప్పించారు.

రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ కింగ్ కోబ్రాను వెంబడించి ఎంతో చాకచక్యంగా దానిని బంధించాడు.. కింగ్ కోబ్రాను పట్టుకొనే క్రమంలో అది బుసలు కొడుతూ రగిలిపోయింది. స్నేక్ క్యాచర్ దాని దృష్టి మళ్లించేందుకు చెప్పును చూపిస్తూ అటూ ఇటూ ఆడించగా ఒక్కసారిగా నోటితో చెప్పును అందుకొని కరచింది. పొరపాటున అది చెప్పును కాకుండా.. స్నేక్ క్యాచర్ ని కాటేసి ఉంటే.. ఊహించడానికే భయంగా ఉంది. అనంతరం దాని నోటి నుండి చెప్పును బయటకు తీసి.. కింగ్ కోబ్రాను దూరంగా అటవీ ప్రాంతంలో వదిలేశాడు.

Exit mobile version