Site icon NTV Telugu

ఆర్ధిక, రెవెన్యూ శాఖల్లో కీలక మార్పులు…

cm jagan

ఏపీ ఆర్ధిక, రెవెన్యూ శాఖల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. వాణిజ్య పన్నులు, స్టాంపులు- రిజిస్ట్రేషన్ల విభాగాలను ఆర్ధిక శాఖ పరిధిలోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.
ఇప్పటి వరకూ వాణిజ్య పన్నులు, స్టాంపులు- రిజిస్ట్రేషన్ల విభాగాలు రెవెన్యూ శాఖ పరిధిలో ఉన్న విషయం తెలిసిందే. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్, రిజిస్ట్రేషన్లు స్టాంపుల శాఖ డైరెక్టర్, ఐజీ కార్యాలయాలు, ఏపీ వ్యాట్ ట్రైబ్యునల్ లాంటి సంస్థలన్నీ ఆర్ధికశాఖ నియంత్రణలో పని చేస్తాయని స్పష్టం చేసారు. ఆర్ధిక వనరుల నిర్వహణను సులభతరం చేసేందుకు మార్పులు చేసిన ప్రభుత్వం… ఈ అంశాలను ఆర్ధిక శాఖ కార్యదర్శి గుల్జార్ పర్యవేక్షిస్తారని పేర్కొంది.

Exit mobile version