NTV Telugu Site icon

రఘురామకృష్ణరాజు అనే సన్యాసికి మీకు సంబంధం ఏంటి… !

బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణపై మేయర్ కావటి మనోహర్ మండిపడ్డారు. ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తే మీ గురించి నిజాలు మాట్లాడతానని ఫైర్ అయ్యారు. మోస్ట్ సీనియర్, జస్ట్ సీఎం పదవి మిస్ అని చెప్పుకునే మీకు ఎన్ని‌ ఓట్లు వచ్చాయో అందరికీ తెలుసు అని.. నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా పోటీచేస్తే 15 వేల ఓట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు మేయర్ కావటి మనోహర్. కార్పోరేషన్ ఎన్నికలలో కన్నా సొంత డివిజన్‌లో 600 ఓట్లు వచ్చాయని..రఘురామకృష్ణరాజు అనే సన్యాసికి మీకు సంబంధం ఏంటి? అని నిలదీశారు. ప్రభుత్వం, సీఎం జగన్ పై అసత్య ఆరోపణలు చేసి.. కన్నా తన ఉనికి చాటుకోవాలని ప్రయత్నిస్తున్నారని…కన్నాను ప్రజలు మరిచిపోయే రోజు దగ్గరలోనే ఉందన్నారు.