ప్రభుత్వంలో కాపులకు లభిస్తోన్న ప్రాధాన్యత, కాపు సంక్షేమ కార్యక్రమాల పైనా చర్చించేందుకు కాపు నేతలు కీలక సమావేశం నిర్వహించారు. వివిధ పార్టీల్లోని కాపు నేతలు.. కాపు సామాజిక వర్గ ప్రముఖులు జూమ్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకున్నారు. కాన్ఫరెన్సులో ఘంటా, బొండా, వట్టి వసంత కుమార్, మాజీ ఐఏఎస్సులు రామ్మోహన్, భాను, మాజీ ఐపీఎస్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. 13 జిల్లాల్లోని కాపు ప్రముఖులకూ కారెన్సకు ఆహ్వానం ఇచ్చారు.
సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా కాపులు అస్థిత్వం కొల్పోయేలా పరిణామాలు చోటు చేసుకోవడంపై సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. కాపు కార్పోరేషన్ పరిస్థితి దారుణంగా ఉందని సమావేశంలో పలువురు అభిప్రాయపడ్డట్టు సమాచారం. పార్టీలకతీతంగా సామాజిక వేదిక ఏర్పాటుకు నిర్ణయించారు. వచ్చే నెల రెండో వారంలో విజయవాడలో భేటీ కావాలని నిర్ణయం. ఈ వేదిక ద్వారానే రాజకీయ లక్ష్యాలు నెరవేర్చుకునేలా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని పలువురు నేతలు అభిప్రాయపడ్డట్లు తెలుస్తోంది.