Minister Kanna Babu Fired on TDP Leaders at Andhra Pradesh Legislative Council.
ఏపీ శాసన మండలిలో జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చించాలంటూ టీడీపీ నేతలు రచ్చ చేశారు. దీంతో మంత్రి కన్న బాబు టీడీపీ నేతల తీరుపై ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో జంగారెడ్డిగూడెం మరణాలపై ముఖ్యమంత్రి మాట్లాడిన విషయాన్ని టీడీపీ సభ్యులు వక్రీకరిస్తున్నారని ఆయన అన్నారు. టీడీపీ సభ్యులు జరగని విషయాన్ని జరిగినట్లు చెబుతున్నారని, నాలుగు శవాలు కనిపిస్తే చాలు తెలుగుదేశం నాయకులు అక్కడికెళ్లి శవరాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
ఎక్కడ శవాలు ఉంటాయా అని వీళ్ళు వెతుకుతుంటారని, గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు స్నానం సరదా కోసం 29 మందిని చంపేశారన్నారు. స్నానం షూటింగ్‌కు బలైన 29 మంది కుటుంబాలను కనీసం చంద్రబాబు పరామర్శించారు లేదని కన్నబాబు ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో ఇసుక మాఫియా చేతిలో 22 మంది చనిపోయారని, కనీసం వాళ్లకు సానుభూతి కూడా చంద్రబాబు ప్రకటించలేదన్నారు. జంగారెడ్డిగూడెంలో నిన్న చంద్రబాబు చేసింది రాజకీయ యాత్ర అని, రాజకీయాల కోసం జంగారెడ్డి గూడెం మరణాన్ని చంద్రబాబు వాడుకుంటున్నారన్నారు.
