TDP vs Janasena: కాకినాడ జిల్లా తుని కూటమిలో కొత్త పంచాయతీ మొదలైంది.. టీడీపీ అభ్యర్థిగా ఉన్న యనమల దివ్య గెలుపు కోసం ఎన్నికల్లో ఎంతో కృషి చేశామని, ఇప్పుడు జనసేనకి కనీస విలువ ఇవ్వడం లేదని అంటున్నారు ఆ పార్టీ తుని కోఆర్డినేటర్ గణేష్.. ఎన్నో ఇబ్బందులు పడుతూ పార్టీలో ఉంటున్నామని, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీలో కూడా జనసేనకు నియోజకవర్గంలో అన్యాయం జరిగిందని కార్యకర్తల సమావేశంలో గుర్తుచేస్తున్నారు.. అన్నిటినీ భరిస్తూ వస్తున్నామని, తిరుపతి లెటర్ ను కూడా తీసుకోలేని దుస్థితిలో జనసేన పార్టీ కార్యకర్తలు ఉన్నారని బరెస్ట్ అవుతున్నారు.. ఎన్ని ఇబ్బందులు పడినా నియోజవర్గంలో పార్టీని బతికించుకుంటామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టిగా నిలబడతామని, సీట్ల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనే రాజీ పడే ప్రసక్తి ఉండదని.. జనసేన గెలిచే చోట కచ్చితంగా జనసేన అభ్యర్థి ఉండేలా పోరాడుతామని అన్నారు తుని జనసేన కో-ఆర్డినేటర్ చోడిశెట్టి గణేష్.. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. పైస్థాయిలో టీడీపీ-జనసేన నేతల మధ్య మంచి కోఆర్డినేషన్ ఉన్నట్టుగా కనిపిస్తున్నా.. కింది స్థాయిలో పలు నియోజకవర్గాల్లో కొన్ని సందర్భాల్లో నేతలు ఇలా బయట పడుతూనే ఉన్నారు.. తమకు అన్యాయం జరుగుతోంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం విదితమే..
Read Also: Chiranjeevi- Ram Charan : చిరుకు కలిసొచ్చింది.. చరణ్ కు ఎదురుదెబ్బ.. రూట్ మార్చారా..?
