Driver Subramaniam Murder Case: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణలో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి మరింత విచారణ చేయాలని కోర్టు దృష్టికి తీసుకుని వెళ్లారు సిట్ అధికారులు. పునర్విచారణ చేసి 90 రోజుల్లోపు అడిషనల్ చార్జీ షీట్ దాఖలు చేయాలని న్యాయస్థానం గత నెల 22న ఆదేశాలు ఇచ్చింది.. ఇప్పటికే ఎమ్మెల్సీ గన్ మెన్ ను విచారణ చేశారు… మరోవైపు అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గతో పాటు ఇద్దరు అనుచరులు గంగాధర్, ప్రవీణ్ లను కూడా విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు.. దానిపై వాళ్లు హైకోర్టుని ఆశ్రయించినట్లు తెలుస్తుంది.. దీనికి సిట్ కూడా కౌంటర్ వేయాల్సి ఉంటుంది.. ఏ కారణం చేత వాళ్ళని విచారణ చేయాలని అనుకుంటున్నారు అనేది కోర్టుకు స్పష్టం చేయాల్సి ఉంటుంది.. నోటీసులు ఇచ్చిన వ్యవహారంలో కూడా ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు సిట్ బృందం.. దానికి అనుగుణంగా గతంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
Read Also: CM Revanth Reddy : బీహార్‌కు సీఎం రేవంత్, మంత్రులు.. ఎందుకంటే..?
హత్య జరిగిన కొన్నిరోజుల తర్వాత అనంతబాబుని అదుపులోకి తీసుకుని ఐఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.. కానీ ఆ సమయంలో ఫోన్ నుంచి ఎటువంటి వివరాలు తీసుకోలేదని సిట్ బృందం ప్రాథమికంగా అంచనాకి వచ్చింది… హత్య జరగక ముందు ఎమ్మెల్సీ ఎవరెవరితో మాట్లాడారు అనేది తెలుసుకునే పనిలో పడ్డారు.. వాట్సాప్ కాల్స్ ఆడియో వీడియో కాల్స్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు.. గతంలో ఫోన్ స్టేట్ ఫోరెన్సీక్ ల్యాబ్ కి పంపిన పాస్ వర్డ్ ఇవ్వలేదు.. అప్పుడు ఆ ఫోన్ లాక్ తీయాలంటే న్యాయస్థానం అనుమతి తీసుకోవాలి.. ఆ దిశగా కూడా కోర్టును ఆశ్రయించడానికి సిద్ధమవుతుంది సిట్… హత్య జరిగినప్పుడు అనంతబాబు తో పాటు కారులో ఎవరూ లేరని గత విచారణలో తేల్చారు అధికారులు. దానికి అనుగుణంగా కూడా మరింత సమగ్రంగా సమాచారం సేకరిస్తున్నారు .. అవసరమైతే మరింత మందిని ఇన్వెస్టిగేషన్ చేస్తామని అధికారులు అంటున్నారు.. ఇప్పటికే కోర్టు ఇచ్చిన గడువులో ఒక నెల అయిపోయింది కాబట్టి మరింత త్వరితగతిన విచారణ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.. దానికి అనుగుణంగా అడిషనల్ చార్జ్ షీట్ దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నారు సిట్ అధికారులు
