Deputy CM Pawan Kalyan: మతాల మధ్య చిచ్చు పెట్టే శక్తులతో అప్రమత్తంగా ఉండాలి అంటూ కీలక సూచనలు చేశారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కాకినాడలోని ఎస్పీ కార్యాలయంలో పోలీస్ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆయన.. మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూసే శక్తుల పట్ల పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని పవన్ స్పష్టం చేశారు. లా అండ్ ఆర్డర్ నిర్వహణ పకడ్బందీగా ఉండాలని, నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు.
Read Also: Anil Ravipudi: ట్రోలింగ్‌పై డైరెక్టర్ అనిల్ రావిపూడి షాకింగ్ కామెంట్స్..
మతాల పేరుతో ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నించే శక్తులను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు పవన్ కల్యాణ్. ఉల్లంఘనలకు పాల్పడే వారు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా చట్టప్రకారం కఠినంగా వ్యవహరించాలని పవన్ అధికారులకు స్పష్టం చేశారు. ప్రజల భద్రతే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత అని, శాంతియుత వాతావరణం కొనసాగాలంటే పోలీస్ శాఖ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని అన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా శాంతి భద్రతలను కాపాడటంలో పోలీస్ యంత్రాంగం నిబద్ధతతో పనిచేయాలని కోరారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
