Site icon NTV Telugu

Kakinada: కాకినాడలో పాలస్తీనా జెండాలతో ప్రదర్శన- నాలుగు కార్లు సీజ్!

Kaninada

Kaninada

Kakinada: కాకినాడలో మిలాద్ ఉన్-నబీ ర్యాలీ సందర్భంగా నాలుగు కార్లపై పాలస్తీనా జాతీయ జెండాలను ప్రదర్శించిన ఘటన స్థానికంగా వివాదానికి దారి తీసింది. ఈ ఘటనపై పోలీసులు చర్యలు తీసుకుని ఆ కార్లను సీజ్ చేశారు. ఇక, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొందరు ముస్లిం యువకులు మిలాద్ ఉన్-నబీ ర్యాలీలో పాల్గొంటూ కార్లపై పాలస్తీనా జెండాలను ఎగుర వేశారు. అయితే, దర్యాప్తులో ఆ కార్లలో కొన్ని అద్దె వాహనాలుగా ఉన్నట్లు తేలింది.

Read Also: Digital Fasting: బాసు డిజిటల్ ఉపవాసం తెలుసా.. ఎందుకైనా మంచిది ఓ లుక్ వేయండి

ఈ ఘటనపై పోలీసులు కొందరు యువకులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. జెండాలను ఎందుకు ప్రదర్శించారు? ఎవరు తయారు చేశారు? బయట నుంచి ఎవరైనా వచ్చారా? అనే కోణంలో విచారణ చేపట్టారు. కానీ, యువకులు మాత్రం తమకు వేరే ఉద్దేశం లేదని, పాలస్తీనా యుద్ధంలో అమాయకులు చనిపోతున్నందుకు సపోర్టుగా మాత్రమే జెండాలను ప్రదర్శించామని వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, పాలస్తీనా జెండాలతో ప్రదర్శన చేసిన నాలుగు కార్లను సీజ్ చేశామని కాకినాడ సీఐ తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ కొనసాగిస్తున్నాం.. ఇప్పటికే కొందరు యువకులను అదుపులోకి తీసుకున్నామని చెప్పుకొచ్చారు.

Exit mobile version