తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్‌ల ఎన్నికలు ఇవాళ జరగనున్నాయి. ఎన్నిక నిర్వహణకు కార్పొరేషన్ యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. నగరపాలక సంస్ధ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు జరుగనుంది ఎన్నిక. మెజారిటీ కార్పోరేటర్లు అవిశ్వాసం మేరకు మేయర్, డిప్యూటీ మేయర్ లను తొలగిస్తూ ఈనెల 12న తీర్మానం చేశారు.
ఈమేరకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆదేశాల మేరకు నేడు మేయర్, డిప్యూటీ మేయర్‌ల పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మరో వైపు టీడీపీ మేయర్ సుంకర పావని హైకోర్టుకు వెళ్లడంతో న్యాయస్థానం తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.