Site icon NTV Telugu

తండ్రి ఆరోగ్యం కోసం తిరుపతికి తనయుడి పాదయాత్ర

కృష్ణా జిల్లాలో 10వ రోజు కొనసాగుతోంది టీడీపీ కాకినాడ పార్లమెంట్ ఇన్‌ఛార్జి జ్యోతుల నవీన్ తిరుపతి పాదయాత్ర. ఈరోజు గన్నవరం నుండి విజయవాడకు కొనసాగుతోంది పాదయాత్ర. తండ్రి జ్యోతుల నెహ్రూ అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కోలుకోవడంతో తిరుపతి వస్తానని మొక్కుకున్నాడు కొడుకు జ్యోతుల నవీన్.

50 మంది కార్యకర్తలతో జగ్గంపేట నుండి తిరుపతి పాదయాత్రకి బయలుదేరారు జ్యోతుల నవీన్. ప్రతీ 100కి.మీ లకు ఒక కొబ్బరి మొక్క నాటుతున్నారు జ్యోతుల నవీన్. విజయవాడ వెళ్ళేలోపు 2వ కొబ్బరి మొక్క నాటుతానని జ్యోతుల నవీన్ చెబుతున్నారు. తన తండ్రి ఆరోగ్యం బాగుపడాలని కోరుకుంటున్న జగ్గంపేట నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు జ్యోతుల నవీన్.

Exit mobile version