NTV Telugu Site icon

JC Prabhakar Reddy: చొక్కా విప్పి జేసీ హల్‌చల్..కేతిరెడ్డి ఫ్లెక్సీకి ఫ్లయింగ్ కిస్

Jc1 (1)

Jc1 (1)

జేసీ ప్రభాకర్ రెడ్డి.. అనంతపురం జిల్లాలో ఆయనో స్పెషల్.. మాజీ ఎమ్మెల్యేగానే కాదు ప్రస్తుతం తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ గా ఆయన అందరికీ చిరపరిచితుడు. అధికార పార్టీపై ఆయన విమర్శలు చేస్తుంటారు. సమస్యలపై పోరాటం చేస్తారు. ఆయన తన ఆఫీసులోనే నిరసన వ్యక్తం చేస్తారు. మునిసిపల్ ఆఫీసులోనే స్నానాలు చేశారు. మునిసిపల్ కమీషనర్ అవినీతిపై ధ్వజమెత్తారు. ఇవ్వాళ మరో అడుగు ముందుకేశారు. అర్ధనగ్న ప్రదర్శన ఇచ్చారు. చొక్కా విప్పి హల్‌చల్ చేశారు. అక్కడితో ఆగలేదు- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక శాసనసభ్యుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫ్లెక్సీకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. గత కొద్దిరోజులుగా కేతిరెడ్డి పెద్దారెడ్డి- జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

Read Also: Jobs Fraud: ఉద్యోగాల పేరుతో వల.. లక్షల్లో మోసం చేసిన కేటుగాడు

ఇసుక అక్రమ రవాణా, మున్సిపాలిటీలో డీజిల్ దుర్వినియోగం వంటి అంశాల మీద ఈ ఇద్దరు నేతల మధ్య మాటల దాడి తారస్థాయికి చేరుకుంది. అదికాస్తా ఫ్లెక్సీలపైకీ ఎక్కింది. తాడిపత్రి మున్సిపాలిటీలో డీజిల్‌ను ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇష్టానుసారంగా, తన సొంత అవసరాల కోసం వాడుకుంటున్నాడంటూ వైసీపీ నాయకులు ఆరోపించారు.

అయితే అసలు డీజిల్ దొంగ ఎవరో తేలాలంటున్నారు జేసీ. తాడిపత్రి మున్సిపాలిటీలో చోటు చేసుకున్న డీజిల్ వినియోగానికి సంబంధించిన లెక్కలను వివరిస్తూ ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ ఫ్లెక్సీల వద్ద తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి హల్‌చల్ చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డిని గజదొంగగా అభివర్ణించారు. ఈ ఫ్లెక్సీల్లో ప్రచురించిన సమాచారం అంతా అబద్ధమంటూ ధ్వజమెత్తారు. కావాలంటే మున్సిపాలిటీ లెక్కలను బయటికి తీసి, ప్రజల ముందు పెడతానని సవాల్ విసిరారు.అంతేకాదు ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చారు. తాను ప్రజల మనసు దోచుకున్న దొంగను అంటూ చొక్కా విప్పి మరీ ప్రదర్శించారు. తాడిపత్రి అని రాసివున్న పేపర్‌ను గుండె ఆకారంలో కత్తిరించి, దాన్ని తన కడుపుపై అతికించుకున్నారు. మొత్తం మీద జేసీ-పెద్దారెడ్డిల మధ్య మాటల యుద్ధం ఏ స్థాయికి చేరుతుందో చూడాలి. ప్రభాకర్ రెడ్డి ఫ్లయింగ్ కిస్ లు మాత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.

Read Also: Sreya sran: నన్ను అడగడం కాదు.. ఇదే ప్రశ్న హీరోలను అడిగే ధైర్యం మీకు ఉందా? శ్రియ సీరియస్‌

Show comments