Site icon NTV Telugu

నేడు విజయవాడకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్

అమరావతి : నేడు విజయవాడ కు రానున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇవాళ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో విమానంలో విజయవాడ కు చేరుకోనున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రేపు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలోనే… పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగుర వేయనున్నారు జనసేనాని. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల అనంతరం పార్టీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు పవన్ కళ్యాణ్‌. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మరియు ప్రభుత్వ విధానాల పై చర్చించనున్నారు పవన్‌ కళ్యాణ్‌.

Exit mobile version