ప్రభుత్వ పాఠశాలల్లో వినూత్న సంస్కరణలు చేపట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. జగనన్న గోరుముద్దలో మరో పోషకాహారం చేరనుంది. రేపటి నుండి బడి పిల్లలకు ఉదయం పూట రాగి జావ అందించనున్నారు. జగనన్న గోరుముద్దలో భాగంగా రేపటి నుండి వారానికి 3 రోజుల పాటు రాగి జావ అందించే కార్యక్రమం చేపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 44,392 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో పథకం అమలు చేయనున్నారు. ఈ పథకం ద్వారా 37,63,698 మంది విద్యార్ధులకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకం కోసం ఏటా రూ. 86 కోట్ల వ్యయం అవుతుందని భావిస్తున్నారు. ఆర్థికఇబ్బందులు ఉన్నా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థినీ, విద్యార్ధులకు ఈ పథకం ద్వారా పోషకాహారం అందించాలని సీఎం జగన్ ఆదేశించారు.
Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
రేపు క్యాంప్ కార్యాలయం నుండి లాంఛనంగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం వైఎస్ జగన్. వర్చువల్ విధానంలో ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని 44392 పాఠశాలల్లోని 37.63లక్షల మంది పిల్లలకు వారంలో మూడు రోజుల పాటు రాగి జావ పంపిణీ చేస్తారు. రాగి జావ ద్వారా రక్తహీనత, పోషకాల లోపాలను నివారించవచ్చని ప్రభుత్వం చెబుతోంది.
Read Also: Tuesday Falguna Amavasya Bhakthi Tv Live: ఫాల్గుణ అమావాస్యనాడు ఈ స్తోత్రాలు వింటే..