Site icon NTV Telugu

AP: సీఎస్‌కు ఐపీఎస్ అధికారి ఏబీవీ లేఖ.. ఆ అధికారం మీకు లేదు..!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మకు సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు లేఖ రాశారు.. తనను ఇంకా సస్పెన్షన్‌లో కొనసాగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పేర్కొన్న ఆయన.. ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీతోనే రెండేళ్లు నిండాయని లేఖలో గుర్తుచేశారు.. రెండేళ్లకు మించి సస్పెన్షన్ ను కొనసాగించాలంటే.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి తప్పనిసరనే విషయాన్ని లేఖలో ప్రస్తావించిన ఏబీవీ. గడువులోగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకోలేదు కాబట్టి.. తన సస్పెన్షన్ ముగిసినట్లేనని స్పష్టం చేశారు..

Read Also: Traffic Challan’s: 650 కోట్ల విలువైన చలాన్స్ క్లియర్.. మరింత కఠినంగా రూల్స్..!

ఇక, నిబంధనల ప్రకారం తనపై ఉన్న సస్పెన్షన్ ఆటోమేటిక్ గా తొలగి పోయినట్లే అని లేఖలో సీఎస్‌ దృష్టికి తీసుకెళ్లిన ఈ సీనియర్‌ ఐపీఎస్‌.. సర్వీస్ రూల్స్ ప్రకారం సస్పెన్షన్ తొలగినందున నా పూర్తి జీతం వెంటనే ఇవ్వండి అని కోరారు.. నా సస్పెన్షన్‌కు ఆరేసి నెలల వంతున ఇచ్చిన పొడిగింపు జనవరి 27తోనే ముగిసిందని… 31.7.2021న చివరిసారిగా నా సస్పెన్షన్‌ను పొడిగిస్తూ ఇచ్చిన జీవోను రహస్యంగా ఉంచారని.. నాకు ఆ కాపీ కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఇక, ఏమైనప్పటికీ… ఫిబ్రవరి 8తో నా సస్పెన్షన్ ముసిపోయిందని సీఎస్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు.

Exit mobile version