Site icon NTV Telugu

Team India: వరల్డ్ కప్ సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టు.. జగన్, పవన్ అభినందనలు

Wc

Wc

Team India: వరల్డ్ కప్- 2025 సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టుకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో దక్షిణాఫ్రికాను ఓడించి ఐసీసీ మహిళల వరల్డ్ కప్ 2025 ను దక్కించుకున్న భారత జట్టు చరిత్ర సృష్టించింది.. ప్రతి ప్లేయర్ నైపుణ్యం, పట్టుదల, జట్టు ఆటతో 140 కోట్ల భారతీయులు గర్వపడేలా చేశారని ప్రశంసించారు. షాఫాలీ వర్మ అద్భుతమైన ఇన్నింగ్స్‌కు పవన్ కళ్యాణ్ ప్రత్యేక అభినందించారు. అలాగే, దీప్తీ శర్మ బ్యాటింగ్, బౌలింగ్‌లో చూపించిన ఆల్‌రౌండ్ ప్రదర్శన జట్టుకి కీలకంగా మారింది.. ఈ ప్రపంచ కప్ విజయం భారత అమ్మాయిల్లో క్రీడలపై నమ్మకాన్ని మరింత పెంచుతుంది అని ఉప ముఖ్యమంత్రి పవన్ కొనియాడారు.

Read Also: Kash Patel: ఆమె దేశభక్తురాలు.. జెట్‌లో వెళ్తే తప్పేంటి? సమర్థించుకున్న ఎఫ్‌బీఐ చీఫ్

ఇక, ప్రపంచ కప్ గెలిచిన మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించిందంటూ ఎక్స్ (ట్వీట్టర్) వేదికగా మాజీ సీఎం వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్‌లో విజయం సాధించిందని తెలిపారు. వారు చూపిన అంకితభావం, ఆత్మవిశ్వాసం మొత్తం దేశాన్నే గర్వపడేలా చేశాయి.. కడపకు చెందిన శ్రీచరణి ఈ విజేత జట్టులో భాగం కావడం మరింత సంతోషకరం అన్నారు. భారత క్రికెట్ చరిత్రలో ఈ అద్భుత విజయాన్ని స్వర్ణ అధ్యాయంగా గుర్తుంచుకుంటారు.. ఈ విజయం ప్రతి భారత యువతికి పెద్ద కలలు కనడానికి ప్రేరణగా నిలుస్తుంది అని వైఎస్ జగన్ రాసుకొచ్చారు.

Read Also: Ilaiyaraaja: 15 ఏళ్లలోపు ప్రతిభావంతులైన చిన్నారులకు ఇళయరాజా గోల్డెన్ ఛాన్స్!

అలాగే, ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 విజేతగా నిలిచిన టీమిండియాకి ఏసీఏ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ శుభాకాంక్షలు తెలిపారు. భారత మహిళల సత్తాను మన జట్టు ప్రపంచానికి చాటి చెప్పింది అన్నారు. తన బౌలింగ్ తో మేజిక్ చేసిన శ్రీచరణీకి ఏసీఏ తరుపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను.. ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025ను సాధించిన టీమిండియా యువ మహిళ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. మహిళ క్రికెట్ ను, మహిళ క్రీడాకారులకు ఏసీఏ ప్రోత్సాహం అందిస్తుంది అని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు.

Exit mobile version