Site icon NTV Telugu

Independence Day LIVE UPDATES: వజ్రోత్సవ వేళ.. అంతా త్రివర్ణశోభితం

Independence Day Live Updat

Independence Day Live Updat

Independence Day LIVE UPDATES: భారతదేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటోంది. ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని దేశంలోని ప్రతిచోట వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. రెండు దశాబ్దాల బ్రిటీష్‌ వారి అణచివేత తర్వాత వలస పాలన నుంచి భారత్ స్వాతంత్య్రం పొందింది. సుదీర్ఘ పోరాటం తర్వాత, 1947 ఆగస్టు 15న, భారతీయులు బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి విముక్తిని సాధించింది. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం విదేశీ పాలన నుంచి భారతదేశం స్వాతంత్ర్యం పొంది 75 సంవత్సరాలు అవుతోంది. ఈమేరకు ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ పేరుతో ఈ వేడుకలు నిర్వహిస్తోంది. అలాగే హర్ ఘర్ తిరంగ ప్రచారం ఈ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉంది. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా జాతీయ జెండాను ఎగురవేయడానికి ప్రజలను ప్రోత్సహిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించి జాతి మొత్తాన్ని ఉద్దేశించి సంప్రదాయ ప్రసంగం చేస్తారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం, స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎగురవేసే సమయం ప్రకటించారు. ఉదయం 7.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం అనంతరం జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది.

The liveblog has ended.
  • 15 Aug 2022 02:35 PM (IST)

    త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన హిమాచల్ ప్రదేశ్ సీఎం

    హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సరహన్‌లో జరిగిన కార్యక్రమంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.

  • 15 Aug 2022 02:32 PM (IST)

    జాతీయ జెండా ఆవిష్కరించిన కర్ణాటక, గుజరాత్ సీఎంలు

    దేశంలో స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కర్ణాటకలోని బెంగళూరులో సీఎం బసవరాజ్‌ బొమ్మై జాతీయ జెండాను ఆవిష్కరించారు. గుజరాత్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారు.

     

  • 15 Aug 2022 02:12 PM (IST)

    జాతీయ జెండాను ఆవిష్కరించిన మాజీ రాష్ట్రపతి కోవింద్

    ఢిల్లీలోని తన నివాసంలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

  • 15 Aug 2022 01:55 PM (IST)

    నివాసంలోనే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్వాతంత్య్ర వేడుకలు

    లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఢిల్లీలోని తన నివాసంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు.

     

  • 15 Aug 2022 01:05 PM (IST)

    జాతీయ జెండాను ఆవిష్కరించిన తమిళనాడు సీఎం స్టాలిన్

    చెన్నైలోని సెయింట్ జార్జ్ ఫోర్ట్‌లో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ జాతీయ జెండాను ఎగురవేశారు.

     

  • 15 Aug 2022 12:31 PM (IST)

    త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా

    స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఢిల్లీలో జాతీయ జెండాను ఎగురవేశారు.

  • 15 Aug 2022 12:29 PM (IST)

    మహాత్మ గాంధీకి నివాళులర్పించిన రాహుల్ గాంధీ

    స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పార్టీ 'ఆజాదీ గౌరవ్ యాత్ర'లో భాగంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ ఇతర నాయకులు గాంధీ స్మృతికి చేరుకుని మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.

  • 15 Aug 2022 12:27 PM (IST)

    జాతీయ జెండాను ఆవిష్కరించిన మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే

    మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ముంబయిలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

  • 15 Aug 2022 12:24 PM (IST)

    త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించిన జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్

    జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాంచీలో జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. "ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ గురించి తాను వాగ్దానం చేశానని.. కేబినెట్ ఈ ప్రతిపాదనను ఆమోదించింది. ఇది త్వరలో అమలు చేయబడుతుంది." అని ట్వీట్ చేశారు.

  • 15 Aug 2022 12:21 PM (IST)

    నేషనల్ వార్ మెమోరియల్ వద్ద రాష్ట్రపతి నివాళులు

    ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులర్పించారు. ఆర్మీ చీఫ్, జనరల్ మనోజ్ పాండే, ఇండియన్ నేవీ చీఫ్, అడ్మిరల్ ఆర్‌. హరి కుమార్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి హాజరయ్యారు.

     

  • 15 Aug 2022 12:04 PM (IST)

    జాతీయ జెండాను ఆవిష్కరించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

    ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జాతీయ జెండాను ఎగురవేశారు.

  • 15 Aug 2022 12:02 PM (IST)

    జానపద కళాకారులతో కలిసి నృత్యం చేసిన మమతా బెనర్జీ

    కోల్‌కతాలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జానపద కళాకారులతో కలిసి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నృత్యం చేశారు. వారితో కలిసి ఆ ఆనందాల్లో పాల్గొన్నారు.

  • 15 Aug 2022 12:02 PM (IST)

    భారత దేశానికి స్వాతంత్ర్యం రక్త పాతంతో వచ్చింది -జనసేన అధినేత పవన్‌

    భారత దేశానికి స్వాతంత్ర్యం రక్త పాతంతో వచ్చింది. సరదాగా సందడి చేస్తే రాలేదు. రెండు దేశాలు విడిపోతున్న సమయం లో మతోన్మాదం తో ప్రజలను ఊచకోత కోశారు.స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన యోధులను జనసేన ఆదర్శంగా తీసుకుంది. కులం కోసం మతం కోసం పోరాటాలు కాదు. దేశం కోసం పోరాటం చేయాలన్నారు.

  • 15 Aug 2022 12:00 PM (IST)

    జాతీయ జెండాను ఆవిష్కరించిన కేరళ సీఎం పినరయి విజయన్

    కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కేరళ సీఎం పినరయి విజయన్ జాతీయ జెండాను ఎగురవేశారు.

     

  • 15 Aug 2022 11:59 AM (IST)

    స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో బిహార్ సీఎం నితీష్ కుమార్

    ఈరోజు పాట్నాలోని గాంధీ మైదాన్‌లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బీహార్ సీఎం నితీష్ కుమార్ పాల్గొన్నారు.

  • 15 Aug 2022 11:12 AM (IST)

    ప్రతి రంగంలోనూ దేశం మొత్తం నివ్వరుపోయే ఫలితాలు - సీఎం కేసీఆర్

    ప్రతి రంగంలోనూ దేశం మొత్తం నివ్వరుపోయే ఫలితాలను సాధిస్తూ.. ప్రగతి పథంలో పరుగులు పెడుతోంది. తెలంగాణ ప్రజల ఆశీర్వాద ఫలం , ప్రజాప్రతినిధుల నిరంతర కృషి, ప్రభుత్వం సిబ్బంది అంకిత భావం వల్లనే తెలంగాణ అపూర్వ విజయాలను సొంతం చేసుకుంటుంది.

  • 15 Aug 2022 11:10 AM (IST)

    నేడు తెలంగాణ దిక్సూచిగా. దేదీప్యమానంగా వెలుగొందుతుంది- సీఎం కేసీఆర్

    కేంద్రంలో అధికారంలో వున్న పెద్దలు ఆరి వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు విద్వేశ రాజకీయాలతో.. ప్రజలను విభజించే ఎత్తుగడలకు పాల్పడుతున్నారు. జాతి నిర్మాతలైన ఎందరో.. మహానుభావుల కృషి ఫలితంగా.. భిన్న మతాలు, ప్రాంతాలు, సంస్కృతులు కలిగి భారత సమాజంలో.. పరస్పర విశ్వాసం, ఏకత్వ భావన పాతుకున్నాయి. తరతరాలుగా భారత దేశం నిలబెట్టుకుంటూ వస్తున్న శాంతియుత సహజీవనాన్ని విచ్ఛిన్నం చేసేందుకు రాజ్యాంగ పదవులో వున్నవారే సీఎం అన్నారు. స్వాతంత్ర్య పోరాటాలవీరులకు అనుగునంగా పరిపాలన సాగించుకుంటూ.. స్వతంత్ర భారతంలో 60 సంవత్సరాలు తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఉద్యమించిన తెలంగాణ స్వరాష్ట్రంగా అవతరించి నేడు దిక్సూచిగా మారి దేదీప్యమానంగా వెలుగొందుతుంది.

  • 15 Aug 2022 10:57 AM (IST)

    నేటి నుంచి మరో 10 లక్షల మందికి ఆసరా పథకం కింద పింఛన్లు: కేసీఆర్

    "వివిధ వర్గాల ఆదాయం పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దేశంలో కరెంట్ కోతలు విధించని రాష్ట్రం తెలంగాణనే. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసింది. ప్రతి వర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం. సంక్షేమంలో దేశంలో నంబర్‌ వన్‌గా తెలంగాణ నిలిచింది. నేటి నుంచి మరో 10 లక్షల మందికి ఆసరా పథకం కింద పింఛన్లు. రాష్ట్రంలో ఆసరా పింఛన్లు 46 లక్షలకు చేరుతాయి. దేశంలో ఎస్సీ వర్గం పట్ల నేటికీ వివక్ష కొనసాగుతోంది. ఎస్సీ వర్గాలు వెనుకబాటుకు చిరునామాలుగా మారుతున్నాయి. ఎస్సీల అభివృద్ధే ధ్యేయంగా దళితబంధు పథకం తెచ్చాం. దళితబంధు పథకం దేశానికి దిశానిర్దేశం చేస్తోంది. దళితబంధు పథకాన్ని సామాజిక ఉద్యమంగా అమలు చేస్తున్నాం. పథకం లబ్ధిదారుల భాగస్వామ్యంతో దళిత రక్షణ నిధి ఏర్పాటు. లబ్ధిదారులు ఆపదకు గురైతే ఆర్థికంగా నిలబెట్టేందుకు నిధి దోహదం. తెలంగాణ వృద్ధి రేటు దేశ వృద్ధిరేటు కంటే 27 శాతం అధికం. ఏడేళ్లలో వ్యవసాయం పరిమాణం 2.5 రెట్లు పెరిగింది. పారిశ్రామిక రంగం రెండు రెట్లు, సేవా రంగం 2.2 రెట్లు పెరిగాయి."  -సీఎం కేసీఆర్

  • 15 Aug 2022 10:47 AM (IST)

    హైదరాబాద్ ను గాంధీజీ గంగా జమునా తెహజీబ్ గా అభివర్ణించారు- సీఎం కేసీఆర్

    స్వాతంత్రోద్యమ సమయంలో తెలంగాణ ప్రజల పిలుపు మేరకు హైదరాబాద్ ను సందర్శించిన గాంధీజీ తెలంగాణ ప్రజల సామరస్య జీవనశైలిని గంగా జమునా తెహజీబ్ గా అభివర్ణించారు. అది మనకు గర్వకారణం అని కేసీఆర్ పేర్కొన్నారు.

  • 15 Aug 2022 10:45 AM (IST)

    భారత స్వాతంత్ర్య సముపార్జన కోసం దేశమంతటా జరిగిన పోరాటం - సీఎం కేసీఆర్

    భారత స్వాతంత్ర్య సముపార్జన కోసం దేశమంతటా జరిగిన పోరాటంలో మన తెలంగాణ వీరులు ఉజ్వలమైన పాత్రను నిర్వహించారు. తుర్రేబాజ్ ఖాన్, రాంజీ గోండు, మౌల్వీ అలావుద్దీన్, భారత కోకిల సరోజినీ నాయుడు, సంగెం లక్ష్మీబాయి, రామానంద తీర్థ, పీవీ నర్సింహారావు మొదలైన వారు సాహసోపేతంగా చేసిన పోరాటం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.

  • 15 Aug 2022 10:43 AM (IST)

    తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారింది: సీఎం కేసీఆర్

    అహింసా మార్గంలో తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారింది. తెలంగాణ.. ప్రగతి పథంలో పయనిస్తోంది. తెలంగాణ.. అపూర్వ విజయాలను సొంతం చేసుకుంటోంది. బలమైన ఆర్థికశక్తిగా తెలంగాణ రూపొందింది. అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్‌ అందిస్తున్నాం. సాగులో 11.6 శాతం వృద్ధిరేటు సాధించాం. గొర్రెల పెంపకంలో దేశంలో నంబర్‌ వన్‌గా నిలిచాం. గ్రామీణ జీవన విధానంలో అగ్రస్థానంలో నిలిచాం. 11.1 శాతం వృద్ధిరేటుతో పారిశ్రామిక ప్రగతిలో అగ్రస్థానంలో ఉన్నాం. దేశ నిర్మాణంలో బలమైన భాగస్వామిగా తెలంగాణ నిలిచింది. చేనేత కార్మికుల బీమా ప్రీమయంను ప్రభుత్వమే చెల్లిస్తోంది.    -సీఎం కేసీఆర్

  • 15 Aug 2022 10:40 AM (IST)

    దళితబంధు దేశానికి దిశానిర్ధేశం చేస్తోంది: కేసీఆర్

    దేశంలో నిరుద్యోగం తీవ్రతరమవుతుంది. కేంద్రంలోని వారు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారే నేడు ఫాసిస్టు దాడులకు పాల్పడుతున్నారు. దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం 84 శాతం ఎక్కువ. రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు అనే పథకాన్ని గొప్పగా అమలు చేస్తోంది. దళితబంధు దేశానికి దిశానిర్ధేశం చేస్తోంది. ప్రభుత్వం వజ్రసంకల్పంతో దళిత బంధును అమలు చేస్తోంది.  -సీఎం కేసీఆర్

  • 15 Aug 2022 10:33 AM (IST)

    ప్రజాసంక్షేమం ప్రభుత్వాల బాధ్యత: సీఎం కేసీఆర్

    ప్రజాసంక్షేమం ప్రభుత్వాల బాధ్యత. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఉచితాలు అనే పదాన్ని తగిలించడం దారుణం. గత ఏడేళ్లలో సొంత పన్నుల ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్. కేంద్ర అసమర్థ నిర్వాకం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది.  -సీఎం కేసీఆర్

  • 15 Aug 2022 10:26 AM (IST)

    స్వాతంత్య్ర వజ్రోత్సవ దినోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం: కేసీఆర్

    ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. స్వాతంత్య్ర వజ్రోత్సవ దినోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం. తెలంగాణ ఆర్థిక రంగంలో దూసుకు పోవడంతో పాటు అన్నపూర్ణగా మారింది. రాష్ట్రం అపూర్వ విజయాలను సాధిస్తోంది. హరితహారం కార్యక్రమంతో ఆకుపచ్చగా మారింది. తెలంగాణ తలసరి ఆదాయంలో నెంబర్‌వన్‌గా ఉంది.  -సీఎం కేసీఆర్

  • 15 Aug 2022 10:22 AM (IST)

    గోల్కొండ కోటలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం.. ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

    హైదరాబాద్‌లోని గోల్కొండ కోట స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. త్రివర్ణ పతాకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.

     

  • 15 Aug 2022 10:05 AM (IST)

    మన స్వాతంత్య్ర పోరాటం మహోన్నతం: ఏపీ సీఎం జగన్

    మన స్వాతంత్య్ర పోరాటం మహోన్నతం. మన ఆత్మగౌరవానికి జాతీయ జెండా ప్రతీక. సార్వభౌమాధికారానికి ప్రతీక. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతీక. పింగళి వెంకయ్య రూపొందించిన జెండా భారతీయుల గుండె. ప్రపంచంతో పోటీపడి ప్రగతిని సాధిస్తున్నాం. ఆహార ధాన్యాల లోటును దేశం అధిగమించింది. ప్రపంచ ఫార్మారంగంలో భారత్ ప్రథమ స్థానంలో ఉంది. ప్రపంచానికి అవసరమైన ఔషధాలను అందిస్తున్నాం. -ఏపీ సీఎం జగన్

  • 15 Aug 2022 09:29 AM (IST)

    తమ నివాసం వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేసిన మంత్రి తలసాని

    వజ్రోత్సవాల్లో భాగంగా తమ నివాసం వద్ద జాతీయ పతాకాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఎగురవేశారు. అనంతరం స్వతంత్ర సమరయోధులకు నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వజ్రోత్సవ వేడుకల్లో ప్రతిఒక్కరు భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలని మంత్రి ఆకాంక్షించారు.

  • 15 Aug 2022 09:24 AM (IST)

    అసెంబ్లీలో త్రివర్ణపతాకాన్ని ఆవిష్కరించిన స్పీకర్‌ పోచారం

    అసెంబ్లీలో స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసనసభ ఆవరణలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, శాసనమండలి ప్రాంగణంలో చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి, అసెంబ్లీ ఆవరణలో మహాత్మా గాంధీ, అంబేడ్కర్‌కు నివాళాలర్పించారు.

  • 15 Aug 2022 09:20 AM (IST)

    ఇందిరాగాంధీ స్టేడియంలో సీఎం జగన్‌ కు పోలీసుల గౌరవ వందనం

    స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా.. సోమవారం ఉదయం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండా ఆవిష్కరించారు సీఎం జగన్‌. అనంతరం ఆయన పోలీస్‌ గౌరవ వందనం స్వీకరించారు.

  • 15 Aug 2022 09:09 AM (IST)

    ప్రగతి భవన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

    భారత 76వ స్వాతంత్ర్య దినోత్సవం, 'స్వతంత్ర భారత వజ్రోత్సవాల' సందర్భంగా, ప్రగతి భవన్ లో జాతీయ జెండా ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు.

  • 15 Aug 2022 09:05 AM (IST)

    జెండా ఎగురవేసిన ఏపీ సీఎం జగన్‌

    ఏపీలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జెండా ఎగురవేసిన ఏపీ సీఎం జగన్‌ త్రివర్ణ పతాకాన్ని జెండా ఎగురవేశారు.

     

  • 15 Aug 2022 08:47 AM (IST)

    ఆత్మనిర్భర్ భారత్ సామూహిక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి- ప్రధాని మోడీ

    'ఆత్మనిర్భర్ భారత్'పై నొక్కిచెప్పిన ప్రధాన మంత్రి, దానిని 'జన్ ఆందోళన్'గా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆత్మనిర్భర్ భారత్ ప్రతి పౌరుడిపై, ప్రతి ప్రభుత్వంపై, సమాజంలోని ప్రతి యూనిట్ బాధ్యతగా మారుతుంది.“ఆత్మనిర్భర్ భారత్, ఇది ప్రభుత్వ ఎజెండా లేదా ప్రభుత్వ కార్యక్రమం కాదు. ఇది సమాజం యొక్క సామూహిక ఉద్యమం, దీనిని మనం ముందుకు తీసుకెళ్లాలి-ప్రధాని మోడీ

  • 15 Aug 2022 08:47 AM (IST)

    ప్రపంచ అవసరాల్ని తీర్చే సత్తా భారత్‌కు ఉంది: ప్రధాని

    మన సైనికులకు ఎన్ని సార్లు వందనం చేసినా తక్కువే. మనదేశం టెక్నాలజీ హబ్‌గా మారుతోంది. డిజిటల్ ఇండియాతో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. జై జవాన్‌, జైకిసాన్, జై విజ్ఞాన్‌తో పాటు జై అనుసంధాన్. ఆత్మనిర్భర్ భారత్ అంటే ప్రభుత్వ పథకం కాదు. ప్రతి ఒక్కరు ఆత్మవిశ్వాసంతో బతకాలనేదే ప్రభుత్వ లక్ష్యం. ప్రజలంతా నిలదొక్కుకోవడమే ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం. ఆయుధాలను విదేశాల నుంచి కొనుగోలును తగ్గిస్తూ.. మేకిన్ ఇండియాలో భారత్ దూసుకెళ్తోంది. ఎరువులు, విద్యుత్ అన్ని రంగాల్లో విదేశాలపై ఆధారపడే పరిస్థితి తగ్గుతోంది. మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ మనదేశంలోనే తయారవుతున్నాయి. ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం మనకు లేదు. ఎరువులు, విద్యుత్ అన్ని రంగాల్లో విదేశాలపై ఆధారపడే పరిస్థితి తగ్గుతోంది. ప్రపంచ అవసరాల్ని తీర్చే సత్తా భారత్‌కు ఉంది. మన పిల్లలు విదేశీ వస్తువులతో ఆడకూడదనే సంకల్పం తీసుకుందాం. - ప్రధాని మోడీ

  • 15 Aug 2022 08:41 AM (IST)

    75 ఏళ్ల స్వాతంత్య్రంపై నేను ఒక సామర్థ్యాన్ని చూడగలిగాను - ప్రధాని

    “చివరి వ్యక్తి కోసం శ్రద్ధ వహించాలనే మహాత్మా గాంధీ కల, చివరి వ్యక్తిని సమర్థుడిగా మార్చాలనే అతని ఆకాంక్ష - నేను దాని కోసం నన్ను అంకితం చేసుకున్నాను. ఆ ఎనిమిదేళ్లు, అనేక సంవత్సరాల స్వాతంత్య్ర అనుభవం ఫలితంగా 75 ఏళ్ల స్వాతంత్య్రంపై నేను ఒక సామర్థ్యాన్ని చూడగలిగాను' అని ప్రధాని మోదీ అన్నారు.

  • 15 Aug 2022 08:33 AM (IST)

    అభివృద్ధి చెందిన దేశం కోసం 'పంచ్ ప్రాణ్'-ప్రధాని మోడీ

    అభివృద్ధి చెందిన దేశం కోసం 'పంచ్ ప్రాణ్' (ఐదు ప్రతిజ్ఞలు) తీసుకోవాలి. "మొదటిది, అభివృద్ధి చెందిన భారతదేశం యొక్క పెద్ద సంకల్పాలు మరియు సంకల్పంతో ముందుకు సాగడం. రెండవది, దాస్యం యొక్క అన్ని జాడలను తుడిచివేయడం. మూడవది, మన వారసత్వం గురించి గర్వపడండి. నాల్గవది, ఐక్యత యొక్క బలం. ఐదవది, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులతో కూడిన పౌరుల విధులు-ప్రధాని మోడీ

  • 15 Aug 2022 08:28 AM (IST)

    కొడుకు, కూతురి మధ్య భేదం చూపిస్తే సమానత్వం రాదు: ప్రధాని

    గ్లోబల్ వార్మింగ్‌కు మన పూర్వీకులు ఎప్పుడో పరిష్కారం చూపించారు. కొడుకు, కూతురి మధ్య భేదం చూపిస్తే సమానత్వం రాదు. వేధింపుల నుంచి మహిళలు బయటపడేలా సంకల్పం తీసుకుందాం. -ప్రధాని మోడీ

  • 15 Aug 2022 08:20 AM (IST)

    ప్రపంచానికి భారత్ కరోనా వ్యాక్సిన్ అందించింది: ప్రధాని

    దేశంలోని అన్ని భాషలను చూసి గర్వపడాలి. డిజిటల్ ఇండియా స్టార్టప్‌లు మన టాలెంట్‌కు ఉదాహరణలు. మనదేశం ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్ అందించింది. నరుడిలో నారాయణుడిని చూసే సంస్కృతి మనది -ప్రధాని మోడీ

     

     

  • 15 Aug 2022 08:17 AM (IST)

    2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలి-ప్రధాని

    2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని యువతను ప్రధాని కోరారు. 2047 నాటికి 50 ఏళ్లు నిండనున్న యువత, స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్ల నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతామని ప్రతిజ్ఞ చేయాలని ప్రధాని మోదీ కోరారు. “మేము ప్రమాణం చేసినప్పుడు, మేము దానిని నెరవేరుస్తాము. అందుకే నా తొలి ప్రసంగంలో స్వచ్ఛ భారత్‌ గురించి మాట్లాడినప్పుడు ఉద్యమం వచ్చింది’’ అని అన్నారు. భారత్‌పై ఆశలు ఉన్నాయని, 130 కోట్ల మంది భారతీయుల నైపుణ్యమే అందుకు కారణమని ప్రధాని మోదీ అన్నారు.

  • 15 Aug 2022 08:16 AM (IST)

    75 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం-ప్రధాని మోడీ

    భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని పునరుద్ఘాటించిన మోదీ, 75 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామని, అమూల్యమైన సామర్థ్యం ఉందని దేశం నిరూపించుకుందని ప్రధాని మోడీ అన్నారు.

  • 15 Aug 2022 08:15 AM (IST)

    వచ్చే 25 ఏళ్లు 5 అంశాలపై దృష్టి సారించాలి: ప్రధాని మోడీ

    వచ్చే 25 ఏళ్లు 5 అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని మోడీ.

    1.దేశంలోని ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలన్నారు.
    2. బానిసత్వపు ఆలోచనను మనసులో నుంచి తీసిపారేయండి.
    3. మనదేశ చరిత్ర , సంస్కృతి చూసి గర్వపడాలి.
    4. ఐకమత్యంతో ప్రజలంతా కలిసి పనిచేయాలి.
    5. ప్రతి పౌరుడు తమ బాధ్యతను గుర్తుంచుకుని పనిచేయాలి

  • 15 Aug 2022 08:14 AM (IST)

    ఈ నేల ప్రత్యేకమైనది -ప్రధాని మోడీ

    మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మన అభివృద్ధి పథాన్ని శంకించే అనేక మంది సంశయవాదులు ఉన్నారు. కానీ, ఈ దేశంలోని ప్రజల గురించి వేరే విషయం ఉందని వారికి తెలియదు. ఈ నేల ప్రత్యేకమైనదని వారికి తెలియదు’’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

  • 15 Aug 2022 08:06 AM (IST)

    అభివృద్ధిలో అందరూ భాగస్వాములవుతున్నారు: ప్రధాని మోడీ

    120 కోట్ల మంది ప్రజలు రాజకీయ సుస్థిరత ఫలితాల్ని ఇప్పుడు చూస్తున్నారన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అభివృద్ధిలో అందరూ భాగస్వాములవుతున్నారని తెలిపారు. సబ్‌కా సాత్ సబ్ కా వికాస్  ఫలాలు అందరికీ అందుతున్నాయన్నారు.

  • 15 Aug 2022 08:02 AM (IST)

    నివాసాలపై మువ్వన్నెల పతాకాలను రెపరెపలాడిస్తూ ప్రజలు మురిసిపోతున్నారు- ప్రధాని

    హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగస్వాములవుతూ ప్రజలు తమ నివాసాలపై మువ్వన్నెల పతాకాలను రెపరెపలాడిస్తూ మురిసిపోతున్నారు. గత రెండు స్వాతంత్య్ర దినోత్సవాలు కొవిడ్‌-19 కారణంగా ఒకింత ఆంక్షల నడుమ జరిగాయి. ఈసారి రెట్టించిన ఉత్సాహంతో జెండా పండగను జాతి యావత్తూ ఘనంగా నిర్వహించుకోనుంది. ఇప్పుడు ఆ భయాలు దాదాపు తొలగిపోయిన స్థితికి చేరుకోవడం, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో రెట్టింపు ఉత్సాహంతో వేడుకలు చేసుకునేందుకు ప్రజలు సిద్ధం అవుతున్నారు.

  • 15 Aug 2022 08:02 AM (IST)

    ప్రతిఒక్క పేదవారికి సహాయం అందేలా చేయడమే లక్ష్యం: ప్రధాని

    దేశంలోని ప్రతిఒక్క పేదవారికి సహాయం అందేలా చేయడమే తన లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. దేశ ప్రజలు పునరుత్తేజంతో ఉండడమే మన బలమన్నారు. మన ముందు ఉన్న మార్గం కఠినమైనదని భారత ప్రజలను ఉద్దేశించి అన్నారు. మన సామర్థ్యం, ప్రజల చైతన్యం వల్ల ప్రపంచం మనదేశాన్ని చూసే దృష్టి మారిందన్నారు.

  • 15 Aug 2022 07:57 AM (IST)

    100 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఎగురవేసిన మంత్రి జగదీశ్‌రెడ్డి

    నల్గొండ జిల్లాలో వజ్రోత్సవాలకు మంత్రి జగదీశ్‌రెడ్డి హాజరయ్యారు. 100 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఎగురవేశారు. పట్టణంలో భారీ త్రివర్ణ పతాకంతో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు.

  • 15 Aug 2022 07:52 AM (IST)

    భారత్ ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిది: ప్రధాని

    త్యాగధనుల పోరాటాల ఫలితమే ఈ స్వాతంత్య్రమని ప్రధాని మోడీ వెల్లడించారు. 75 ఏళ్లు మనం ఎన్నో ఒడిదొడుకుల్ని ఎదుర్కొన్నామన్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా ఓటమిని అంగీకరించలేదన్నారు. భారత్ ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిదన్నారు.

  • 15 Aug 2022 07:47 AM (IST)

    దేశంలోని నలుమూలలా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది: ప్రధాని మోడీ

    దేశప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఆవిష్కరిస్తున్నామని ఆయన అన్నారు. దేశంలోని నలుమూలలా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోందన్నారు. మనదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వజ్రోత్సవ వేడుకలు జరుగుతున్నాయన్నారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన వారిని స్మరించుకుంటూ ముందుకెళ్లాలన్నారు. ప్రధాని మోడీ జెండా ఆవిష్కరణ అనంతరం భద్రతా దళాల గౌరవ వందనం స్వీకరించారు.

  • 15 Aug 2022 07:37 AM (IST)

    ఉదయం 10.30 గంటలకు జెండా ఎగురవేయనున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌

    స్వాతంత్ర్య వేడుకలకు గోల్కొండ కోట ముస్తాబైంది. ఉదయం 10.30 గంటలకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ జెండా ఎగురవేయనున్నారు. అనంతరం సీఎంకు సైనిక బలగాలు గౌరవ వందనం సమర్పించనున్నారు. వెయ్యి మంది కళాకారులతో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు.

  • 15 Aug 2022 07:37 AM (IST)

    జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోడీ

    ఎర్రకోటపై జాతీయ జెండాను ప్రధాని మోడీ ఆవిష్కరించారు. అనంతరం జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగం చేస్తున్నారు.

  • 15 Aug 2022 07:35 AM (IST)

    ఉదయం 9 గంటలకు జాతీయ జెండా ఎగురవేయనున్న సీఎం జగన్‌

    విజయవాడలో స్వాతంత్ర్య వేడుకలకు ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఉదయం 9 గంటలకు సీఎం జగన్‌ జాతీయ జెండా ఎగురవేయనున్నారు. పలు శాఖలకు చెందిన 15 శకటాల ప్రదర్శన అనంతరం వంద అడుగుల భారీ జెండా ఆవిష్కరించనున్నారు సీఎం జగన్‌.

Exit mobile version