Kota Vinutha: జనసేన బహిష్కృత నాయకురాలు కోట వినుత సెల్ఫీ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో మనసునిండా పుట్టెడు బాధ ఉంది.. చేయని తప్పుకు జైలుకు వెళ్లిన బాధ లేకపోయినా, మేము చంపామని ప్రచారం చేయడం చాలా బాధ కలిగిస్తోంది అని ఆవేదన వ్యక్తం చేసింది. రాయుడు చావులో మా ప్రమేయం లేదని న్యాయస్థానం భావించింది.. అందుకే, 19 రోజుల్లోనే మాకు బెయిలు ఇచ్చింది అన్నారు. నెల రోజుల్లోనే కేసులలో ఉన్న వారందరికీ బెయిల్ వచ్చింది.. విదేశాల్లో లక్షల రూపాయల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికే.. మనుషుల ప్రాణాలను తీసేందుకు కాదు అని పేర్కొనింది. అలాంటి మనస్తత్వం మాది కాదు అని కోట వినుత తెలిపింది.
Read Also: Rakul Preet Singh : టాలీవుడ్ లో రకుల్ దుకాణం సర్దేసినట్టేనా? కారణం అదేనా?
అయితే, ఎలాంటి సంబంధం లేదని ఈ కేసులో క్లీన్ చిట్ తో బయటకు వస్తామని జనసేన బహిష్కృత నేత కోట వినుత పేర్కొనింది. చెన్నై కోర్టులో విచారణ జరుగుతున్నందున ఎక్కువ మాట్లాడలేను.. ఏ తప్పు చేయలేదు, నిజ నిజాలు శివయ్యకు తెలుసు.. ఈ అంశంపై ధైర్యంగా పోరాడుతాం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలవడానికి ప్రయత్నిస్తున్నాను.. కాబట్టి మీడియా ముందుకు రాలేక పోతున్నాను అని చెప్పుకొచ్చింది. త్వరలోనే అన్ని ఆధారాలతో మీడియా ముందుకు వస్తాను.. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది.. సత్యమేవ జయతే అంటూ సెల్ఫీ వీడియోను కోట వినుత ముగించింది.
