NTV Telugu Site icon

ఇవాళ కృష్ణపట్నంకు రానున్న ఐసీఎంఆర్ టీమ్..

కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందుకు వారం ,10 రోజుల పాటు బ్రేక్ పడింది. ఇక అర్ధరాత్రి ఆనందయ్య ఇంటికి , మందు పంపిణీ కేంద్రానికి చేరుకున్నారు పోలీసులు. మందు పంపిణీ కేంద్రాన్ని ఖాళీ చేయించి అక్కడున్న మందు తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. త్వరలో ప్రభుత్వమే మ౦దు పంపిణీ చేసే దిశగా చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఆనందయ్య కరోనా మందుకు ప్రభుత్వ అనుమతులు లభించే ఛాన్స్ ఉంది. ఇవాళ కృష్ణపట్నంకు ఐసీఎంఆర్ టీమ్ రానుంది. ఇప్పటికే ఈ మందుపై కృష్ణపట్నంలో ఆయుష్ కమిషనర్ రాములు ఆధ్వర్యంలో అధ్యయనం కొనసాగుతుంది.