Site icon NTV Telugu

Hyderabad – Vijayawada Highway : హైదరాబాద్ -విజయవాడ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్..

Vijayawada

Vijayawada

పండగలు వచ్చాయంటే చాలు ప్రధాన నగరాలు అన్ని ఖాళీ అవుతుంటాయి.. జనాలు అంతా తమ సొంత ఊర్లకు వెళ్తుంటారు.. పల్లెటూరు పండగల హడావిడి గురించి మాటల్లో చెప్పలేము.. అందరు కలిసి ఆనందంగా జరుపుకొనే పండుగలో సంక్రాంతి ఒకటి.. ఈ పండుగకు అందరు పల్లెలలకు వెళ్ళాల్సిందే.. రేపు పండుగ కావడంతో జనాలు ఈరోజు ఉదయం నుంచే ఊర్లకు వెళ్తున్నారు.. ఈ క్రమంలో హైదరాబాద్ – విజయవాడ రహదారి పై భారీ ట్రాఫిక్ జామ్ అయ్యినట్లు తెలుస్తుంది..

తెలంగాణాలో సంక్రాంతికి సెలవులు ఇవ్వడంతో జనాలు సొంత ఊరలకు పయనమయ్యారు.. ఈ క్రమంలో హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాదు నుండి విజయవాడ వచ్చే వాహనాలు ధర్మాజీ గూడెం స్టేజ్ వద్ద విజయవాడ కు మళ్లీంచడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది..

ఇటు హైదరాబాదు రోడ్డు.. అటు విజయవాడ నుంచి హైదరాబాద్ కు వచ్చే వాహనాలతో 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో జాతీయ రహదారిపై అటు, ఇటు వెళ్లకుండా వాహనాలు మధ్యలో ఇరుక్కుపోయాయి.. ఈ ట్రాఫిక్ సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

Exit mobile version